హైదరాబాద్‌లో ఏపీ అధికారి ఆత్మహత్య.. అపార్ట్‌మెంట్ మీది నుంచి దూకి..

భాస్కర రమణమూర్తి 1987 బ్యాచ్‌కి చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

news18-telugu
Updated: October 1, 2020, 11:24 AM IST
హైదరాబాద్‌లో ఏపీ అధికారి ఆత్మహత్య.. అపార్ట్‌మెంట్ మీది నుంచి దూకి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేగింది. ఏపీ అటవీ శాఖా అధికారి వి.భాస్కర రమణ మూర్తి (59) ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్‌లోని రాజీవ్ గృహకల్పలో ఉన్న అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు బాల్కనీ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆయన రెండు నెలలుగా డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. భాస్కర రమణమూర్తి 1987 బ్యాచ్‌కి చెందిన అధికారి. ఆయన ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పని ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటనపై నగర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: October 1, 2020, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading