అమరావతిలో రైతు ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు..

వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్ అనే రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

news18-telugu
Updated: December 26, 2019, 2:51 PM IST
అమరావతిలో రైతు ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న పోలీసులు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాడేపల్లి మండలం పెనుమాకలో రాజధాని ప్రాంతానికి చెందిన రమేశ్ కుమార్ అనే రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గుర్తించిన పోలీసులు.. అతడి యత్నా్న్ని అడ్డుకున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రమేశ్ కుమార్ డిమాండ్ చేశాడు. అమరావతి నిర్మాణానికి తాను 4 ఎకరాల భూమి ఇచ్చానని ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇదిలా ఉండగా, జగన్ సర్కారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని యోచిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
అమరావతి రైతు రమేష్

అటు.. విశాఖ అభివృద్ది కోసం సీఎం జగన్ భారీ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 28న విశాఖలో పర్యటించనున్న రూ.1200 కోట్ల ప్రాజెక్టులకు శంకు స్థాపన చేయనున్నారు.

First published: December 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు