చిత్తూరులో చిన్నారి వర్షిత హత్యపై జగన్ ఆవేదన

మరోవైపు ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఊహా చిత్రం విడుదల చేశారు.

news18-telugu
Updated: November 10, 2019, 12:31 PM IST
చిత్తూరులో చిన్నారి వర్షిత హత్యపై జగన్ ఆవేదన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లాలో చిన్నారి వర్షిత మృతిచెందిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి వర్షిత హత్యపై స్పందించిన జగన్.. హంతకుడ్ని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను జగన్ ఆదేశించారు. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి ఓ వివాహ వేడుకకు వెళ్లిన ఐదేళ్ల చిన్నారి వర్షిణిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా చంపేశారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పోలీసులు విచారణలో భాగంగా కళ్యాణమండపంలో సీసీ టీవీ ఫుటేజిని పరిశిలించారు.

పెళ్లిలో వర్షితను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అనుసరించినట్టు సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించారు పోలీసులు. స్నేహితులతో ఆడుకుంటున్న వర్షితను గమనిస్తూ ఆ వ్యక్తి ఫోటోలు తీసినట్టు తెలుస్తోంది. చిన్నారితో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. ఎవరో పిలవడంతో కల్యాణ మండపంలోకి వర్షిణి పరుగులు తీసింది. ఆ తర్వాతే వర్షిణి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడి ఊహా చిత్రం విడుదల చేశారు. వర్షిణి తల్లిదండ్రులకు ఎవరితోనైనా ..పాత గొడవలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

First published: November 10, 2019, 11:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading