Home /News /crime /

ANOTHER WOMAN SET ABLAZE NEAR SHAMSHABAD IN HYDERABAD SK

శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళను తగులబెట్టిన దుండగులు

శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళను తగులబెట్టిన దుండగులు

శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళను తగులబెట్టిన దుండగులు

ప్రియాంక రెడ్డి హత్య ఘటనను ఇంకా మరవక ముందే.. అదే శంషాబాద్‌లో మరో ఘోరం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు.

    వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. ప్రియాంకను గ్యాంగ్ రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేసిన నలుగురు నిందితులను ఉరితీయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఐతే ప్రియాంక రెడ్డి హత్య ఘటనను ఇంకా మరవక ముందే.. అదే శంషాబాద్‌లో మరో ఘోరం జరిగింది. ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి తగలబెట్టారు. సిద్దులగుట్ట ప్రాంతంలోని బంగారు మైసమ్మ ఆలయం పక్కనే ఈ ఘోరం జరిగింది. అటుగా వెళ్తున్న స్థానికులు చూసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఐతే అప్పటికే ఆమె చనిపోయిందని వెల్లడించారు.

    ఘటనా స్థలంలో రక్తపు మరకలు, ప్లేట్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి దుస్తులు, చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలి వయసు 35 ఏళ్లు ఉంటుందని.. సాయంత్రం 06.30 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ మృతదేహం ఎవరిది? ఆమెను ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా? లేదంటే అక్కడ అత్యాచారం చేసి చంపారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Hyderabad, Murder, Shamshabad

    తదుపరి వార్తలు