ఢిల్లీ నిర్భయ కేసులో మరో ట్విస్ట్... దోషులకు ఇప్పట్లో ఉరి వేస్తారా? లేదా?

భారత న్యాయవ్యవస్థలో లొసుగుల్ని వాడుకొని ఉరి శిక్షను ఆలస్యం అయ్యేలా చేసుకుంటున్నారు నిర్భయ కేసులో దోషులు. ఫలితంగా ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలవుతుందా లేదా అన్న డౌట్ తెరపైకి వచ్చింది.

news18-telugu
Updated: January 19, 2020, 6:15 AM IST
ఢిల్లీ నిర్భయ కేసులో మరో ట్విస్ట్... దోషులకు ఇప్పట్లో ఉరి వేస్తారా? లేదా?
ఢిల్లీ నిర్భయ కేసులో మరో ట్విస్ట్... దోషులకు ఇప్పట్లో ఉరి వేస్తారా? లేదా?
  • Share this:
ఎన్నో మార్పుల తర్వాత ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఫిబ్రవరి 1న నిర్భయ కేసులో నలుగురు దోషులకూ ఉరి శిక్ష వెయ్యాలని ప్రకటించింది. అది అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఐతే... ఆ రోజున ఉరి శిక్షను వాయిదా వేసుకునేందుకు దోషులు మరో కొత్త ఎత్తుగడ వేశారు. దాని పేరే చోరీ. అవును... ఇదేంటంటే... వీళ్లంతా కలిసి చేసిన ఓ చోరీ కేసు... ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు వీళ్లు ఏమంటున్నారే... ఆ చోరీ కేసు తేలిన తర్వాతే... తమకు శిక్ష అమలు చెయ్యాలని మెలిక పెడుతున్నారు. ఇదంతా వీళ్లు ఆడుతున్న నాటకమనీ... శిక్ష అమలును వాయిదా వేసేందుకే ఈ పనికిమాలిన లాజిక్స్ చెబుతున్నారని కొందరు లాయర్స్ ఫైర్ అవుతున్నారు. ఆ చోరీ కేసుకూ... ఈ నిర్భయ కేసుకూ లింకు లేదనీ... నిర్భయ కేసులో శిక్ష అమలై తీరుతుందని అంటున్నారు.

తీహార్ జైలు యంత్రాంగం మాత్రం... హైకోర్టులో చోరీ కేసు తేలేవరకూ తాము ఉరిశిక్షను అమలు చెయ్యలేమని అంటోంది. దోషుల తరపు లాయం ఏపీ సింగ్ కూడా ఇదే వాదనను తెరపైకి తెస్తున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ డీ కే గార్గ్ మాత్రం... అలాంటిదేమీ ఉండదంటున్నారు. దోషులకు ఉరిశిక్ష వెయ్యాలని తీర్పు వచ్చాక... ఇతరత్రా ఏ కేసులు ఉన్నా... అవన్నీ పక్కకు పోతాయనీ... అవి పెండింగ్‌లో ఉన్నా... వాటి ప్రభావం ఈ కేసుపై పడదని అంటున్నారు. అందువల్ల ఫిబ్రవరి 1నే ఉరిశిక్ష అమలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు.

2015 ఆగస్టులో ఢిల్లీ పాటియాలా కోర్టు... చోరీ, కిడ్నాపింగ్ కేసులో వినయ్ శర్మ, అక్షయ్ థాకూర్, ముఖేష్ సింగ్, పవన్ గుప్తా... నలుగుర్నీ దోషులుగా గుర్తించింది. ఆ కేసులో వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కేసు పెండింగ్‌లో ఉంది.

చూశారా... నలుగురు దోషులు... దోషులుగా తేలిన తర్వాత కూడా మన దేశంలో శిక్షలు వెయ్యలేకపోతున్నారు. పైగా... ఆల్రెడీ శిక్ష ఖరారైనా... దాన్ని అమలు చేయకుండా అడ్డుకునేందుకు ఎన్నో లొసుగులు. ఇక ఇలాగైతే... అత్యాచారాలు ఎక్కడ ఆగుతాయి?

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు