హైదరాబాద్‌లో మరో దారుణం... సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై రేప్?

Hyderabad : ఓవైపు షాద్‌నగర్ బాధితురాలి ఉదంతంపై యావత్ దేశం అట్టుడికిపోతుంటే... అదే హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగడాన్ని ఏమనుకోవాలి? దుర్మార్గులకు చట్టమంటే భయమే లేకుండా పోతోందా?

news18-telugu
Updated: December 1, 2019, 5:59 AM IST
హైదరాబాద్‌లో మరో దారుణం... సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై రేప్?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Hyderabad : ఓవైపు రేపిస్టులను ఉరితియ్యాలని యావత్ దేశం డిమాండ్ చేస్తుంటే... దుర్మార్గులకు ఏమాత్రం భయం కలగట్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కేటుగాడు. బాధితురాలు, ఆమె అక్క కలిసి... హైదరాబాద్... నిజాంపేటలో... ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. అక్క ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. చెల్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అక్క తన పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలో తన వివరాల్ని ఉంచింది. పది రోజుల కిందట ఒకడు అమెను చూసేందుకు వచ్చాడు. తర్వాత మరో నాలుగుసార్లు ఆమె కోసం అంటూ అపార్ట్‌మెంట్‌కి వచ్చాడు. శనివారం ఉదయం కూడా అలాగే వచ్చాడు. ఆ టైంలో చెల్లి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమెను రేప్ చేసినట్లు తెలిసింది. షాకైన ఆమె స్పృహ తప్పి పడిపోయింది. అక్కడి నుంచీ అతడు మెల్లగా జారుకుంటున్న టైంలో అక్క అక్కడికొచ్చింది. మళ్లీ ఎందుకొచ్చారని అడిగితే... రూ.2 లక్షలు కావాలన్నాడు. తన దగ్గర లేవంది. సరే అంటూ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. చెల్లి నిద్రపోతోందనుకున్న అక్క... తిరిగి బయటేదో పనుంటే వెళ్లింది. సాయంత్రం 7 గంటలకు ఇంటికొచ్చింది. ఇంటికి తాళం వేసి ఉంది. చెల్లి బయటికి వెళ్లిందేమో అని తనకు కాల్ చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. కాసేపు చెల్లి కోసం చూసిన ఆమె... ఎంతకీ ఆమె రాకపోవడంతో... ఓసారి కిటికీ లోంచీ చూసింది. చీకట్లో ఏమీ కనిపించలేదు. చేసేది లేక... రంపంతో తాళం కోసి లోపలికి వెళ్లింది. అంతే... ఇల్లంతా చిందరవందరగా ఉంది. చెల్లి చూస్తే అపస్మారక స్థితిలో ఉంది. ఇంట్లోని గోల్డ్ చైన్, చెల్లి సెల్‌ఫోన్ లేవు. షాకైన ఆమె... అంతా ఆ దుర్మార్గుడి పనే అనుకుంటూ... పోలీసులకు కాల్ చేసింది. ఇంటికి వచ్చిన పోలీసులు... వెంటనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా అన్నది పోలీసులు కన్‌ఫాం చెయ్యలేదు. కానీ జరిగే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకుంటే తప్ప... విషయం తెలియదు. ఉదయం ఇంటికి వచ్చిన వ్యక్తే... తర్వాత వెళ్లిపోయినట్లు నటించి... తిరిగి వెనక్కి వచ్చి... చోరీ చేసి, ఇంటికి తాళం వేసి పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

 

Pics : కుందనపు బొమ్మ శ్రేయ ఘోషాల్... క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

నేడు ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం, ఆర్టీసీపై చర్చHealth Tips : పొట్ట తగ్గాలా... చెరుకు రసాన్ని ఇలా తాగితే సరి...

Health Tips : బరువు తగ్గాలా... అల్లంతో ఇలా చెయ్యండి

Health Tips : టీ కంటే డికాక్షన్ బెటర్... మెదడుకు చురుకుదనం

Healthy Food : పాలకూర దోఖ్లా... తింటే ఎంతో ఆరోగ్యం
First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు