ANOTHER STUDENT STABS STUDENT TO DEATH AT HARYANA SCHOOL VIDEO GOES VIRAL SNR
Haryana:ఫ్రెండ్‌ని క్లాస్‌రూమ్‌లోనే కత్తితో పొడిచి చంపాడు..ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి
(క్లాస్ రూమ్‌లో కత్తిపోట్లు)
Video viral:ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవ గ్రామంలో టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. క్లాస్‌రూమ్‌లో మాటమాట పెరగడంతో వీరేన్ అనే విద్యార్దిని శుభమ్ అనే విద్యార్ది కత్తితో పొడిచాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుని బంధువులు దాడి చేసిన స్టూడెంట్ కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో పోలీసు బలగాలు మోహరించి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నారు.
;కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్ మధ్య జరిగిన చిన్న గొడవ..రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణానికి కారణమైంది. ఓవైపు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సమయంలో క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ని మరో స్టూడెంట్ హత్య చేయడమే ఇందుకు కారణమైంది. హర్యానా (Haryana)రాష్ట్రం హర్‌సింగ్‌పురా (Harsinghpura)గ్రామంలోని సంస్కార్ భారతి (Sanskar Bharathi)ప్రైవేట్ స్కూల్లో ఈదారుణం జరిగింది. 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్ష (Practical exam) జరుగుతున్న సమయంంలో తరగతి గదిలో 12వ తరగతి విద్యార్థులు శుభం(Shubham), వీరేన్ (Veeren)మధ్య గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో శుభం వీరేన్ను కత్తితో పొడిచాడు. అదే సమయంలో క్లాస్‌రూమ్‌లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటంతో జరిగిన ఘటన చూసి అంతా హడలిపోయారు. వీరేన్పై కత్తితో దాడి చేసిన శుభం అక్కడి నుంచి పారిపోయాడు. కత్తి దాడిలో గాయపడిన వీరేన్ రక్తపు మడుపులో పడి ఉండటంతో మిగిలిన విద్యార్ధులు భయపడిపోయారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న స్కూల్లో దాడి చేయడంతో కలకలం రేపింది. స్టూడెంట్స్ ఆందోళన చెందుతూ పరుగులు తీసారు. పాఠశాలలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు స్కూల్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
క్లాస్ రూమ్‌లో కత్తిపోట్లు..
గాయపడిన వీరేన్ని ముందు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కత్తిపోట్లతో తీవ్రంగా రక్తస్రావం కావడంతో డాక్టర్లు అక్కడి నుంచ కర్నాల్‌కు రిఫర్ చేశారు. అక్కడికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు పోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. వీరేన్ హత్యతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీరేన్ తరపు బంధువులు, శుభం తరపు కుటుంబ సభ్యులు పరస్పరం దాడులు చేసుకున్నారు. విద్యార్దుల మధ్య గొడవ హత్యకు దారి తీయడం..అటుపై రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో పోలీసులు గ్రామంలో మోహరించారు.
(క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌కి కత్తిపోట్లు)
గ్రామంలో టెన్షన్ టెన్షన్..
ఇరువర్గాల ఘర్షణల నేపధ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హర్‌సింగ్‌పురా గ్రామంలో భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కేసులో ఇంకా ఎవర్ని అరెస్ట్ చేయలేదని డీఎస్పీ మనోజ్‌కుమార్ తెలిపారు. తర్వాత ఇరువర్గాలను స్టేషన్‌కి పిలిపించిన పోలీసులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు.
(క్లాస్‌రూమ్‌లో కత్తిపోట్లు)
చిన్న గొడవతో..
స్టూడెంట్స్ మధ్య ఘర్షణ కారణంగా ఓ ప్రాణం పోవడంతో గ్రామంలో గొడవలు మొదలయ్యాయి. వాటిని కంట్రోల్ చేసేందుకు పోలీసు బలగాలు గ్రామంలో తిష్టవేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.