అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియాలో చెసాపీక్ లోని వాల్ మార్ట్ స్టోర్ లో మేనేజర్ జరిపిన కాల్పుల్లో 14 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. అలాగే పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తుంది. వీరిని సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా కాల్పులు జరిపిన మేనేజర్ ను పోలీసులు హత మార్చారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.