హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారయత్నం...

హైటెక్ సిటీకి సమీపంలోని నిజాంపేట ఈశ్వర్ విల్లాస్ రోడ్డులో ఉండే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతిపై అత్యాచారయత్నం జరిగింది.

news18-telugu
Updated: November 30, 2019, 11:03 PM IST
హైదరాబాద్‌లో మరో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారయత్నం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
షాద్‌నగర్ హత్యాచార ఘటన గురించి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సమయంలోనే మరోవైపు హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హైటెక్ సిటీకి సమీపంలోని నిజాంపేట ఈశ్వర్ విల్లాస్ రోడ్డులో ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌పై అత్యాచార యత్నం జరిగింది. దీంతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి చేరుకుంది. బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాడు. అత్యాచారయత్నం చేసిన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో రూమ్ లోకి వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. స్థానికులు గమనించి అప్రమత్తమయ్యే లోపు నిందితుడు పరారయ్యాడు.

First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>