మరో షాద్‌నగర్ దిశ...రేప్ చేసి జైలుకెళ్లి...బెయిల్‌పై వచ్చి యువతిని 30 కత్తిపోట్లు పొడిచి...

. 10 రోజుల క్రితం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన శివకుమార్ కత్తిని తెప్పించుకున్నాడు. జైలు నుంచి వచ్చిన నాటి నుంచి ఆ బాలిక ఇంటిపై కన్నేసి ఉంచాడు. సోమవారం ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లోకి చొరబడిన అతడు లోపల నుంచి మెయిన్ డోర్ గడియ పెట్టాడు.

news18-telugu
Updated: December 3, 2019, 3:23 PM IST
మరో షాద్‌నగర్ దిశ...రేప్ చేసి జైలుకెళ్లి...బెయిల్‌పై వచ్చి యువతిని 30 కత్తిపోట్లు పొడిచి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో దిశ హత్యాచారం మరువకముందే మరో దారుణ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 17 సంవత్సరాల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి దానికి ఆ నేరంతో జైలు కెళ్లిన యువకుడు రెండు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం  ఆ బాలిక ఇంట్లోకి చొరబడి 30 కత్తిపోట్లు పొడిచి హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం జబల్‌పూర్‌లో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది.  రెండు నెలల క్రితం బాధిత బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా అరెస్టు చేసి పోకో చట్టం కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సరిగ్గా 10 రోజుల క్రితం బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు బాధితురాలిపై పగపెంచుకున్నాడు. ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా జైలు నుంచి వచ్చిన నాటి నుంచి ఆ బాలిక ఇంటిపై కన్నేసి ఉంచాడు. సోమవారం ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లిన వెంటనే ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం బాధితురాలిని కత్తితో 30 పోట్లు పొడిచాడు. గట్టిగా కేకలు వేయడాన్ని బయట ఆడుకుంటున్న ఆమె తమ్ముడు విన్నాడు. వెంటనే పక్కింటి వారికి ఈ విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు.

ఆ బాలిక ఆర్తనాదాలు విన్న స్థానికులు ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆమె శరీరంపై దాదాపు 30 కత్తిపోట్లు ఉన్నాయని, అధిక రక్తస్రావం కారణంగా ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఇది ప్రతీకార హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>