అమెరికాలో మళ్లీ కాల్పులు... 10మంది మృతి

గత అర్ధరాత్రి కూడా అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

news18-telugu
Updated: August 4, 2019, 3:30 PM IST
అమెరికాలో మళ్లీ కాల్పులు... 10మంది మృతి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 4, 2019, 3:30 PM IST
24 గంటల వ్యవధిలోనే అగ్రరాజ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఒహాయో డేటస్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్మాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పదిమంది మృతి చెందాడు. దీంతో షూటర్‌ను పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు. గత అర్ధరాత్రి కూడా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రెండు ఘటనల్లో మృతుల సంఖ్య 30కు చేరింది.

వీకెండ్లను టార్గెట్ చేస్తూ అమెరికాలో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. గత ఆదివారం కూడా అగ్రారాజ్యంలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.మరో 13 మంది గాయాలపాలయ్యారు. వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ.. రెచ్చిపోతున్న ఉన్మాదులపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...