తెలంగాణలో మరో పరువు హత్య... తల్లితో పాటు నెలల బిడ్డను చంపేసి, పెట్రోల్ పోసి...

మేడ్చల్ జిల్లాలో వివాహిత, 6 నెలల చిన్నారి దారుణ హత్య... చంపేసి, పెట్రోల్ పోసి తగులబెట్టిన దుండగులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 9:28 PM IST
తెలంగాణలో మరో పరువు హత్య... తల్లితో పాటు నెలల బిడ్డను చంపేసి, పెట్రోల్ పోసి...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 10, 2019, 9:28 PM IST
తెలంగాణ రాష్ట్రంలో మరో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. మేడ్చల్ జిల్లాలో ఓ తల్లితో పాటు ఆరు నెలల వయసున్న చిన్నారిని అత్యంత క్రూరంగా చంపేశారు. సదరు మహిళ రెండేళ్ల క్రితం వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమ వివాహం చేసుకోవడంతో ఈ హత్య వెనక కుటుంబసభ్యుల హస్తం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు. వరంగల్ జిల్లాలోని బొల్లికుంట గ్రామానికి చెందిన సుశ్రుత అనే 24 ఏళ్ల యువతి... బి ఫార్మసీ పూర్తి చేసింది. చదువుకుంటున్న సమయంలో జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడూరు గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే సుశ్రుత, రమేశ్ ఇద్దరూ వేర్వేరు కులానికి చెందిన వారు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. రెండేళ్ల క్రితం ఇంట్లో చెప్పకుండా ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ.

ఇద్దరూ పెద్దలకు దూరంగా మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ మండలంలోని కొండాపూర్ ఏరియాలో కాపురం పెట్టారు. వీరి కాపురానికి నిదర్శనంగా ఆరు నెలల క్రితం ఓ బిడ్డ కూడా జన్మించాడు. ఆదివారం ఫిబ్రవరి 10న సుశ్రుత, ఆమె బిడ్డను కొండపూర్ గ్రామ శివారులో హత్య చేసి, దహనం చేశారు దుండగులు. ఇద్దరినీ అత్యంత క్రూరంగా చంపి, గుర్తులు తెలియకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. రమేశ్ కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని సుశ్రుత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...