హోమ్ /వార్తలు /క్రైమ్ /

కన్నకూతుర్ని అతిదారుణంగా చంపి, ఆ తర్వాత... వేరే కులం వాడిని ప్రేమించిందని...

కన్నకూతుర్ని అతిదారుణంగా చంపి, ఆ తర్వాత... వేరే కులం వాడిని ప్రేమించిందని...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి, రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు... విషయం తెలిసి నిలదీసిన తల్లిదండ్రులు... ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో కన్నకూతుర్ని గొంతునులిమి చంపి, ఆపై ఆత్మహత్య...

అభివృద్ధిలో దేశం ఎంత దూసుకుపోతున్నప్పటికీ... మనిషి నరనరాల్లో ఇంకుకుపోయిన కులాల కుళ్లు మాత్రం ఇంకా వదలడం లేదు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరువు హత్యల గురించి మరిచిపోకముందే... తమిళనాడు రాష్ట్రంలో మరో పరువు హత్య వెలికి వచ్చింది. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందని, కన్నకూతుర్ని అతిదారుణంగా చంపిన ఆమె తల్లిదండ్రులు, తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని సేలం ఆత్తుకాడు ఏరియాలో వెలుగుచూసింది. ఆత్తుకాడు ఏరియాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు 43 ఏళ్ల రాజ్‌కుమార్, 35 ఏళ్ల భార్య శాంతి దంపతులు. వీరికి 19 ఏళ్ల రమ్య, 17 ఏళ్ల కుమారుడు దీన్‌దయాళ్ ఉన్నారు. అయినా ఓ ప్రవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య... కొన్నాళ్లుగా తన క్లాస్‌మేట్‌తో ప్రేమలో ఉంది. అతను వేరే కులానికి చెందినవాడు కావడంతో ఇంట్లో చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.

కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని, ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని తండ్రి రాజ్‌కుమార్‌కు తెలిసింది. వెంటనే కూతుర్ని నిలదీసిన శాంతి, రాజ్‌కుమార్ దంపతులు, ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ముగ్గురూ గొడవపడుతుండడంతో కంగారుపడిన కొడుకు దీన్‌దయాళ్ పక్కనే ఉన్న బామ్మగారి ఇంట్లో పడుకున్నాడు. కూతురి ఎంత చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు, రమ్య గొంతునులిమి చంపేశారు. కూతుర్ని చంపేసిన తర్వాత ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయాన్ని నిద్రలేచిన దీన్‌దయాల్... ఇంటికి వచ్చి చూసేసరికి ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు చుట్టుపక్కలవారు. తల్లిదండ్రులు, సోదరి ఒకేసారి దూరంకావడంతో దిన్‌దయాళ్, దిక్కుతోచని స్థితిలో తీవ్రమనోవేదనకు గురయ్యాడు.

Published by:Krishna P
First published:

Tags: Crime, Honor Killing, Tamilnadu

ఉత్తమ కథలు