అదే బావిలో మరో అమ్మాయి శవం..హాజీపూర్‌లో అసలేం జరుగుతోంది..?

ఇద్దరు అమ్మాయి హత్యలు ఒకే తరహాలు జరిగాయి. బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. కొన్ని రోజులు తర్వాత బావిలో శవాలై తేలారు. శ్రావణిని రేప్ చేసి చంపేసిన నేపథ్యంలో...మనీషాను కూడా అత్యాచారం చేసి హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

news18-telugu
Updated: April 29, 2019, 9:07 PM IST
అదే బావిలో మరో అమ్మాయి శవం..హాజీపూర్‌లో అసలేం జరుగుతోంది..?
మనీషా
  • Share this:
అదే ఊరు...! అదే బావి..! మరో అమ్మాయి మృతదేహం..! యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మళ్లీ కలకం రేగింది. కొన్ని రోజులు క్రితం తెలంగాణలో సంచలనం రేపిన శ్రావణి హత్య కేసు తరహాలోనే మరో ఘటన జరిగింది. అంతేకాదు శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో అమ్మాయి శవం దొరికింది. బావికి కొద్ది దూరంలో ఓ బ్యాగులో ఆధార్‌ కార్డు కూడా లభ్యమైంది. ఆ మృతదేహం నెల రోజుల క్రితం అదృశ్యమైన మనీషాదేనని పోలీసులు భావిస్తున్నారు. బావి నుంచి డెడ్‌బాడీని బయటకుతీసి పోస్టుమార్టం కోసం తరలించారు.

మనీషా తల్లిదండ్రులు తిప్పరబోయిన మల్లేశం, భారతమ్మ. వీరికి మనీషా నాలుగో సంతానం. మేడ్చల్ జిల్లా కీసరలోని కేఎల్‌ఆర్ కాలేజీలో ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మార్చి 15న కాలేజీ వెళ్లిన మనీషా తిరిగి రాలేదు. ఐతే ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని భావించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తమ కూతురు తమను విడిచిపెట్టి వెళ్లిపోయిందని లోలోపలే కుమిలిపోయారు.

ఐతే కొన్ని రోజుల క్రితం అదే ఊరిలో జరిగిన శ్రావణి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెెలుగులోకి వచ్చాయి. ఆ కేసులో అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో మనీషా విషయం కూడా బయటపడింది. దాంతో పోలీసులు బావి దగ్గరకు వెళ్లి పరిశీలించగా మనీషా మృతదేహం కనిపించింది. శ్రావణిని హత్య చేసినట్లుగానే మనీషాను హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మొన్న శ్రావణి, ఇవాళ మనీషా..! శ్రావణి పదోతరగతి విద్యార్థిని కాగా.. మనీషా డిగ్రీ స్టూడెంట్..! ఒకే గ్రామంలో ఒకే తరహాలో ఇద్దరు బాలికలను హత్య చేయడం తెలంగాణలో సంచలనం రేపుతోంది.

హాజీపూర్‌లో ఘటనా స్థలాన్ని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన శ్రావణి, మనీషా కుటుంబాలకు కోమటిరెడ్డి చెరో రూ.50వేల నగదు అందజేశారు. కేసీఆర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులను ఆదుకోవాలని..రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


హాజీపూర్‌ గ్రామంలోకి రావాలంటే ఆటోలోవచ్చి లోపలికి నడుచుకుంటూ వెళ్లాలి. మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలో బావి ఉంటుంది. ఈ మార్గంలో గంజాయి ముఠాలు, అసాంఘిక శక్తులు ఉంటాయని పోలీసులకు గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతలోనే హాజీపూర్‌‌లో ఈ ఘోరాలు వెలుగుచూశాయి. ఇద్దరు అమ్మాయి హత్యలు ఒకే తరహాలు జరిగాయి. బయటకు వెళ్లిన విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు. కొన్ని రోజులు తర్వాత బావిలో శవాలై తేలారు. శ్రావణిని రేప్ చేసి చంపేసిన నేపథ్యంలో...మనీషాను కూడా అత్యాచారం చేసి హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.First published: April 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading