హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై పది రోజులుగా అత్యాచారం..

హైదరాబాద్‌(Hyderabad)లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలికపై పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడో కామాంధుడు.

news18-telugu
Updated: January 29, 2020, 8:48 AM IST
హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై పది రోజులుగా అత్యాచారం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలికపై పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడో కామాంధుడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్న దంపతులకు కూతురు ఉంది. తల్లి ఇళ్లలో పని చేస్తుండగా, తండ్రి పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే.. పని కోసం వాళ్లు బయటికి వెళ్తుండటంతో బాలిక ఒంటరిగా ఉంటోందని గుర్తించిన జహంగీర్ అనే యువకుడు.. పది రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి రోజూ ఆమెపై విరుచుకుపడ్డాడు. మంగళవారం నాడు ఆ బాలిక బాలిక నీరసంగా కనిపించడంతో తల్లిదండ్రులు ఏమైందని అడిగారు.

దీంతో ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడు జహంగీర్ పరారీలో ఉన్నాడు.

First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు