దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో శ్రద్దావాకర్ Shraddawakarఅనే యువతిని ప్రియుడే అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో మరొకర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే పట్టుబడిన నిందితుడి హత్యను సమర్ధిస్తూ ఉన్మాదకరమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో పోలీసులు గాలించి మరి పట్టుకున్నారు. పట్టుబడిన వికాస్(Vikas)అనే యువకుడికి సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్య కేసుతో సంబంధం ఉందా ..? లేదా ? అనే విషయలను రాబడుతున్నారు పోలీసులు(Police). అసలు అతని గురించి ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
35కాదు 36ముక్కలుగా నరికాడు..
ఢిల్లీలో శ్రద్దావాకర్ అనే యువతి మర్డర్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. ప్రియురాలిని చంపి..మృతదేహాన్ని 35ముక్కలుగా కట్ చేసి ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరివేసిన అప్తాబ్ అమీన్ పూనావాల అనే ప్రేమోన్మాది సమర్ధిస్తూ రషీద్ పేరుతో ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. శ్రద్దావాకర్ని 35 కాదు 36ముక్కలుగా చేశారని యువకుడు చెప్పిన వీడియో పోస్ట్‌తో పోలీసులు అలర్ట్ అయ్యారు. తన పేరు, ప్రాంతం కూడా చెప్పడంతో పోలీసులు ప్రత్యేక బలగాల సాయంతో వీడియో పోస్ట్ చేసిన యువకుడ్ని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వ్యక్తి పేరు రషీద్ కాదని ..బులంద్‌షహర్‌లోని సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న వికాస్‌గా గుర్తించారు.
సంచలన వీడియో పోస్ట్ చేసిన వికాస్..
వికాస్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నేర చరిత్రపై ఆరా తీయడంతో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. వికాస్ ప్రొఫెషనల్ క్రిమినల్‌గా తేల్చారు. నిందితుడు వికాస్‌పై బులంద్‌షహర్, నోయిడాలో పలు పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో దొంగతనం, దోపిడీ కేసులు నమోదైనట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రద్దావాకర్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు వికాస్ ఢిల్లీలోని ఓ యూట్యూబ్ చానల్లో ఆఫ్తాబ్ శ్రద్ధవాకర్ని 35ముక్కలు కాదు 36ముక్కలుగా నరికాడంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో వీడియో వైరల్ అయింది. అయితే యువతి హత్య కేసులో వికాస్ పాత్ర ఉందా లేక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడా అని పోలీసులు అతని వీడియోని సీరియస్‌గా తీసుకున్నారు.
ఢిల్లీ శ్రద్ద మర్డర్ కేసులో మరొకరు అరెస్ట్ ..
ప్రత్యేక బృందాల ద్వారా రాత్రింబవళ్లు గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. అరెస్టు అనంతరం పోలీసులు నిందితుడిని విచారించగా ఆ యువకుడు రషీద్ కాదని, పట్టుబడిన యువకుడి పేరు వికాస్ అని, ప్రత్యేక వర్గాన్ని కించపరిచేలా స్టేట్మెంట్ ఇచ్చాడని, ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇంకా చాలా ముఖ్యమైన వెల్లడి చేయవలసి ఉంది. పోలీసుల విచారణ తర్వాత మరిన్ని పెద్ద విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వికాస్ గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లుగా ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Delhi news, National News