Home /News /crime /

ANOTHER CASE OF ASSAULT BY BOUNCERS ARMY MAN AMONG 3 THRASHED IN GURUGRAM CLUB PAH

OMG: మరోసారి రెచ్చిపోయిన బౌన్సర్లు.. ఆర్మీ జవాన్ పాటు, మరో ముగ్గురిని..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Haryana: బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. సరదాగా క్లబ్ కు వచ్చిన ఆర్మీ జవాన్ తో పాటు.. మరికొందరిపై ఇష్టమోచ్చినట్లు దాడికి పాల్పడ్డారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Haryana, India
కొన్నిరోజులుగా క్లబ్ లలో సెక్యురిటీలుగా నియమించుకునే బౌన్సర్లు పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇప్పటికే క్లబ్ లు, పబ్ లకు సరదాగా కుటుంబంతో గడపడానికి వచ్చిన వారిపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అనేక సంఘటనలు వెలుగులోనికి వస్తున్నాయి. తాజాగా, మరోక ఘటన వార్తలలో నిలిచింది. తాజాగా, గురుగ్రామ్ లోని (Haryana) సెక్టార్  29 లో ఉన్న క్లబ్ లో, ఆర్మీ జవాన్, తన కుటుంబంతో కలిసి వెళ్లాడు. అప్పుడు.. అక్కడ ఉన్న బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించారు. ఆర్మీజవాను.. సునీల్ కుమార్, అతని సోదరులు ఖాజాన్ సింగ్, అనిల్ కుమార్ లు ‘ఫ్రిక్షన్ క్లబ్’కు తన సోదరులతో కలిసి వెళ్లాడు.

అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. మ్యుజిక్ ప్లే చేయడం అనే విషయంలో అక్కడ గొడవ సంభవించింది. దీనిపై అనిల్ బౌన్సర్‌లలో ఒకరిని మ్యూజిక్ ప్లే చేయమని అభ్యర్థించాడు. కానీ అతను మాతో వాదించడం ప్రారంభించాడు. అంతే కాకుండా.. మరో ఇద్దరు బౌన్సర్లు మమ్మల్ని క్లబ్ నుండి బయటకు తీసుకువచ్చి దారుణంగా కొట్టారని సునీల్ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత మరో ఇద్దరు బౌన్సర్లు ఘటనా స్థలానికి వచ్చి ముగ్గురిని కర్రలతో కొట్టి, బెదిరించి అక్కడి నుంచి పారిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.



వారం క్రితం కూడా ఇలాంటి ఘటనే
ఆగస్ట్ 7, 8 మధ్య రాత్రి ఉద్యోగ్ విహార్ ఫేజ్-2లో ఉన్న కాసా డాంజా నైట్‌క్లబ్ వెలుపల అతిథులను కొట్టడం, బౌన్సర్లు ఒక మహిళపై వేధింపులకు పాల్పడిన సంఘటన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా ముంబైలోని లోకల్ ట్రైన్ లో అమానుష ఉదంతం జరిగింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (Mumbai)  దారుణ ఘటన జరిగింది. తన పనికోసం ముంబై హైకోర్టుకు వెళ్తున్న మహిళ జడ్జీని ఒక వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ ఘటన శాంతాక్రూజ్, చర్చ్‌గేట్ స్టేషన్‌ల ప్రాంతంలో.. ఉన్న మధ్య లోకల్ రైలులో సంభవించింది. రైలులో వుమెన్ కంపార్ట్ మెంట్ లో ఎక్కిన మహిళను నీరాజ్ మియాన్ (33) వెంబడించాడు. ఆమె మహిళ కోచ్ లో ఎక్కింది.

యిన కూడా వదిలిపెట్టలేదు. ఆమెను అనుసరించాడు. దీంతో ఆమె తన సహోద్యోగులకు తెలిపింది. దీంతో తర్వాతి స్టేషన్ లో చేరుకుని, అతడిని అదుపులోనికి తీసుకున్నారు. అతను స్థానికంగా ఉన్న హోటల్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Haryana

తదుపరి వార్తలు