Home /News /crime /

ANGRY WIFE DID SECOND MARRIAGE THEN FIRST HUSBAND SITTING ON DHARNA IN FRONT OF HER IN LAWS HOUSE SSR

First Husband: ఇదేందయ్యా ఇది.. భార్య కోసం ఆమె రెండో భర్త ఇంటి ముందు మొదటి భర్త ధర్నా..!

మొదటి భర్త, రెండో పెళ్లి చేసుకున్న మహిళ

మొదటి భర్త, రెండో పెళ్లి చేసుకున్న మహిళ

బుర్ద్వాన్‌లోని రామచంద్రా కాలనీకి చెందిన ఓ యువతీయువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన మూడు నెలలకే వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రతి రోజూ గొడవలే. భార్యాభర్తలిద్దరూ తిట్టుకోవడం, కొట్టుకోవడమే.

ఇంకా చదవండి ...
    బుర్ద్వాన్‌: కట్టుకున్న భర్త అన్యాయం చేస్తే, ప్రేమించిన ప్రియుడు అన్యాయం చేస్తే వాళ్ల ఇంటి ముందు న్యాయ పోరాటాలకు చేసిన మహిళల గురించి ఇన్నాళ్లు చదివి ఉంటారు. కానీ.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన వెలుగుచూసింది. తన భార్యను తిరిగి కాపురానికి తెచ్చుకునేందుకు ఓ భర్త ఏకంగా ఆమె ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ఆమె అలిగి పుట్టింటికి వెళితే భార్య పుట్టింటి ముందు భర్త ధర్నా చేస్తున్నాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆ భర్త ధర్నా చేస్తుంది తన భార్య రెండో పెళ్లి చేసుకున్న ఇంటి ముందు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బుర్ద్వాన్‌లోని రామచంద్రా కాలనీకి చెందిన ఓ యువతీయువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లయిన మూడు నెలలకే వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. కాపురంలో కలతలు మొదలయ్యాయి. ప్రతి రోజూ గొడవలే. భార్యాభర్తలిద్దరూ తిట్టుకోవడం, కొట్టుకోవడమే. ఈ గొడవల కారణంగా భర్తతో కలిసి ఉండలేనని భావించిన ఆ వివాహిత అత్తింటిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. కొన్ని నెలల తర్వాత భార్యను తిరిగి కాపురానికి తీసుకొచ్చుకునేందుకు భార్య ఇంటికి భర్త వెళ్లాడు.

    అయితే.. ఆమె ప్రతినిత్యం కొడుతూ హింసించే వ్యక్తితో కలిసి ఉండలేనని, తాను రానంటే రానని భార్య అతనికి తెగేసి చెప్పింది. అయినా ఆ భర్త రావాలని పట్టుబట్టడంతో ఆమె కుటుంబ సభ్యులు అతనిని తిట్టికొట్టి పంపించేశారు. ఆ తర్వాత మళ్లీ భార్య కోసం ఆమె ఇంటికి వెళ్లలేదు. కానీ.. కొన్ని రోజుల క్రితం తన భార్య మరో పెళ్లి చేసుకుందన్న విషయం ఆ భర్తకు తెలిసింది. ఊహించని ఈ పరిణామంతో ఆ భర్త నిర్ఘాంతపోయాడు. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసుకుని.. ఆ ఇంటి ముందు ధర్నాకు దిగాడు. తన భార్యను తనతో పంపించాలని.. తనకు విడాకులు ఇవ్వలేదని ఆందోళన చేస్తున్నాడు. అంతేకాదు.. అతని చేతుల్లో రెండు ప్లకార్డులు కూడా ఉన్నాయి. ఒక ప్లకార్డు మీద ‘I love you very much’ అని రాసి ఉండగా.. మరో ప్లకార్డుపై తనపై నిందలేసి మరో వ్యక్తితో ఎందుకు వెళ్లిపోయావంటూ భార్యను నిలదీస్తూ రాసి ఉంది.

    మొదటి భర్త చేస్తున్న ఆందోళనపై ఆ వివాహిత స్పందిస్తూ.. అతను రోజూ తనను హింసించేవాడని.. రోజూ కొడుతుండేవాడని చెప్పింది. అందుకే భయంతో అతని టార్చర్ భరించలేక పుట్టింటికి వెళ్లిపోయానని.. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని ఆమె తెలిపింది. పలుమార్లు తన భర్తకు విడాకులు కోరుతూ నోటీసులు కూడా పంపానని.. స్పందించకపోవడంతో మరో పెళ్లి చేసుకున్నాని కొత్త జీవితం మొదలుపెట్టానని ఆమె చెబుతోంది. ధర్నాకు దిగినా.. గొడవలు చేసినా మొదటి భర్తతో తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పింది. ఈ వ్యవహారం కోర్టులో ఉండగా తన అత్తారింట్లో అడుగుపెట్టే అర్హత కూడా అతనికి లేదని వివాహిత అంటోంది. తన భార్య వెంట వస్తే తప్ప వెళ్లేది లేదని ఆ వ్యక్తి భీష్మించుకుని కూర్చున్నాడు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Husband, Love marriage, Wife

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు