దారుణం..భర్త మర్మాంగాలను కోసిన భార్య...మద్యం తాగాడన్న కోపంతో...

రోజూలాగే భార్య ప్రశ్నించడం..అతడు కోప్పడడం జరిగిపోయాయి. మాటామాటా పెరిగి గొడవ పెద్దవడంతో భార్య కూరగాయాలు కోసే కత్తితో భర్త మర్మాంగాలపై దాడిచేసింది. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

news18-telugu
Updated: March 21, 2019, 6:47 PM IST
దారుణం..భర్త మర్మాంగాలను కోసిన భార్య...మద్యం తాగాడన్న కోపంతో...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్..! వాటిని సర్దుకొని ముందుకెళ్తేనే సంసారం పచ్చగా సాగుతుంది. కానీ ప్రస్తుతం సమాజంలో చిన్న విషయాలే పెద్ద తగాదాలకు కారణమవుతున్నాయి. భార్యభర్తల విడాకులకు దారితీస్తున్నాయి. అంతేకాదు ఏకంగా దాడులు చేసుకునే వరకు...చంపుకునే వరకు వెళ్తున్నాయి. హైదరాబాద్‌లో ఇలాంటి దారుణమే జరిగింది. తాగొచ్చాడన్న కారణంతో భర్త మర్మాంగాలపై కత్తితో దాడిచేసింది భార్య. ఎల్‌బీనగర్‌లో ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాల పాలైన భర్త ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రాజస్థాన్‌కు చెందిన షేర్ సింగ్ (26), సంతోషి బతుకుదెరువు కోస హైదరాబాద్ వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 10 రోజుల క్రితమే వీరు నగరానికి వచ్చారు. భర్త ఎల్‌బీనగర్‌లోని ఓ మార్బుల్ ఫ్యాక్టరీలో పనికి చేరాడు. ఐతే పనిలో చేరినప్పటి నుంచీ రోజూ మద్యం తాగి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కూడా షేర్ సింగ్ మద్యంతాగి రాత్రి ఇంటికి వచ్చాడు. రోజూలాగే భార్య ప్రశ్నించడం..అతడు కోప్పడడం జరిగిపోయాయి. మాటామాటా పెరిగి గొడవ పెద్దవడంతో భార్య కూరగాయాలు కోసే కత్తితో భర్త మర్మాంగాలపై దాడిచేసింది. తీవ్ర గాయాలు కావడంతో బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సెక్షన్ 327 కింద సంతోషిపై పోలీసులు కేసునమోదు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్తకు సేవలు చేస్తోంది సంతోషి. షేర్ సింగ్ కోలుకున్న తర్వాత భార్యను అరెస్ట్ చేసే అవకాశముంది.

First published: March 21, 2019, 6:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading