Street Dogs: రాత్రి సమయాల్లో వీధి కుక్కలు విసిగిస్తున్నాయని.. వాటిని అతడు ఏం చేశాడో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

Dogs: గ్రామ సింహాలుగా పేరగాంచిన వీధి కుక్కలు విసిగిస్తున్నాయని 20కుక్కలకు విషమిచ్చి చంపేశాడో వ్యక్తి. ఒడిశాలోని కటక్ జిల్లాలో 24ఏళ్ల వ్యక్తి ఈ క్రూరత్వానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

 • Share this:
  తెలంగాణ(Telangana) లోనే కాదు.. భారతదేశం(India)లో ఏ గ్రామంలో అయినా వీధి కుక్కలు(Street Dogs) అనేవి ఉంటాయి. వాటిన గ్రామ సింహాలు అని కూడా అంటారు. అపరిచిత వ్యక్తులు ఎవరైనా గ్రామంలోకి వస్తే.. అపి పెట్టే అరుపులు మామూలుగా ఉండవు. ఆ గ్రామంలోని ఎవరో ఒకరు లేచి స్పందించేంత వరకు అవి అరుస్తూనే ఉంటాయి. ఆ అరుపులు కొంతమందికి విసుగు కూడా తెప్పిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి మటన్ షాప్ లో పనిచేస్తున్నాడు. ప్రతి నిత్యం కుక్కుల వచ్చి అక్కడ అరవడం మొదలు పెట్టడంతో అతడికి విపరీతంగా కోపం వచ్చింది. ఎలాగైనా వీటిని మట్టుపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.

  Court Bail: వింత తీర్పు.. బెయిల్ మంజూరు చేయాలంటే.. ఈ పని చేయాల్సిందే..


  అనుకున్నట్లుగా గానే అతడు తన ప్లాన్ ను ఇంప్లిమెట్ చేశాడు. దాదాపు 20 కుక్కలను చంపేశాడు. స్థానికంగా ఇది పెద్ద కలకలం రేపింది. ఎవరు ఇంత పని చేసిందంటూ గ్రామస్థులు ఆరా తీశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని కటక్ జిల్లాలో 24ఏళ్ల వ్యక్తి మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. రోజూ అతడు తన వ్యాపారం చేసుకుంటున్న సమయంలో వీధి కుక్కలు అక్కడకు చేరి విసిగించేవట. ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు గుంపులు, గుపులుగా వచ్చి విసుగుతెప్పించడంతో పాటు షాప్ కు వచ్చే వ్యక్తులకు కూడా చిరాకువ వసేదని చెప్పాడు.

  షాపుకు వచ్చే కస్టమర్లు కూడా విటి ధాటికి రావట్లేదని చెప్పాడు. దీంతో ఓ రోజు అతడు వాటికి విషమిచ్చే చంపేశాడు. అలా మృతి చెందిన 10కుక్కలను దగ్గర్లోని చెత్తకుండీల్లో విసిరేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు విచారణ చేపడుతుండగా. .ఆ తర్వాత వరుసగా శంకర్‌పూర్ గ్రామంలోని తంగీ-చౌద్వార్ బ్లాక్ వద్ద వరుసగా కుక్కలు చచ్చిపడి కనిపించాయి.

  Telangana Crime: భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఇలా జరుగుతుందని ఊహించిఉండరు..


  విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు. మాంసం దుకాణం యజమానిపై అనుమానం రావడంతో అతడిని పట్టుకొని విచారించారు. దీంతో అతడు తానే ఆ కుక్కలను చంపినట్లు ఒప్పుకున్నాడు. మాంసం దుకాణం వద్ద రాత్రి సమయాల్లో 20 వీధి కుక్కలు గుమిగూడి గోల పెట్టి విసిగిస్తుండేవని.. తాను కుక్కల అరుపులకు, గోలకు విసిగిపోయానని అందుకే ఆహారంలో విషమిచ్చి చంపానని పోలీసులకు చెప్పాడు. పలు సెక్షన్ల ప్రకారం.. జంతువులపై క్రూరంగా ప్రవర్తించినట్లు పేర్కొని అతనిపై కేసులు నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ జరిపేందుకు శాంపుల్స్ ను ఫోరెన్సిక్ పరీక్ష చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
  Published by:Veera Babu
  First published: