Jawan shoots himself dead : రాజస్తాన్(Rajastan) లో విషాదం జరిగింది. సెలవు(Leave) ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ జవాన్(Jawan) గన్ తో కాల్చుకుని ఆత్మహత్య(Sucide) చేసుకున్నాడు. CRPFజవాన్, ఆత్మహత్య చేసుకోకుండా ఆపడానికి అధికారులు ప్రయత్నించినా ఫలితం లభించలేదు. సోమవారం జవాన్ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
రాజస్తాన్ జోధ్‌పుర్‌లో సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రం క్యార్టర్స్‌లోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న నరేష్ జాట్ అనే సీఆర్పీఎఫ్ జవాన్ ఆదివారం రోజున సెలవు కావాలని ఉన్నతాధికారులను శనివారం అడిగాడు. అయితే కొన్ని కారణాల వల్ల అధికారులు నరేష్ కి సెలవు మంజూరు చేయలేదు. దీంతో జవాన్‌కి చాలా కోపం వచ్చింది. కోపంలో అతడు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు పాల్డి ఖించియాన్‌లోని CRPF శిక్షణా కేంద్రంలోని తన నివాసంలోకి వెళ్లి తలుపు లాక్ చేసుకొని బాల్కనీ నుండి తన INSAS రైఫిల్‌ను చూపుతూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ గాలిలో కాల్పులు జరిపాడు నరేష్ జాట్. ఒక గంటలో అతను ఎనిమిది రౌండ్లు కాల్చాడు. సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, CRPF అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయుధాన్ని అందజేయడానికి జవాన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించారు, కానీ అతను ఆత్మహత్య చేసుకుంటానని వారిని బెదిరించడం కొనసాగించాడు.
Doctor Death : అనుమానాస్పద స్థితిలో యువ డాక్టర్ మృతి
ఉన్నతాధికారులు నరేశ్‌తో ఫోన్లో మాట్లాడినా అతడు శాంతించలేదు. సుమారు 18 గంటలు ఇంట్లోనే బందీలా గడిపిన జవాన్. సోమవారం ఉదయం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు జవాన్ ఇంటికి వెళ్లి గన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఆదివారం సెలవు మంజూరు చేయకపోవడంతో సీఆర్పీఎఫ్ డీఐజీపై జవాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఓ అధికారి మాట్లాడుతూ...ఆదివారం, నరేష్ DIG నుండి సెలవు కోరాడు. కానీ అధికారి నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు మొదట తన సహోద్యోగి చేతిని కొరికాడని, దీంతో అతడు నరేష్ కి వార్నింగ్ ఇచ్చాడు. అదే కోపంలో జవాన్ నేరుగా నాల్గవ అంతస్తులోని తన క్వార్టర్‌కు వెళ్లి తన భార్య మరియు కుమార్తెతో ఇంట్లోనే ఉండి తాళం వేసుకున్నాడు"అని తెలిపారు. ఆత్మహత్యకు జావన్ ఉపయోగించిన రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ దుహాన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.