కరీంనగర్‌లో దారుణం: ప్రేమ వివాహం.. భర్త మీద కోపం.. కొడుకులను చంపేసి..

ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని భాస్కర్ బయటకు వెళ్లిపోయాడు.ఆ కోపంలో ఉన్న సరోజ.. మధ్యాహ్నం 1గంటకు పిల్లలను ఇద్దరినీ బీరు సీసాతో అత్యంత పాశావికంగా పొడిచి చంపింది.

news18-telugu
Updated: May 25, 2019, 9:50 PM IST
కరీంనగర్‌లో దారుణం: ప్రేమ వివాహం.. భర్త మీద కోపం.. కొడుకులను చంపేసి..
నిందితురాలు సరోజ
  • Share this:
కన్న తల్లే ఆ చిన్నారుల పాలిట మృత్యువుగా మారింది. భర్తతో ఉన్న విభేదాలు ఆభం శుభం తెలియని ఆ చిన్నారులను బలి చేశాయి. అత్యంత కిరాతకంగా కడతేర్చిన ఆ కసాయి తల్లి కరీంనగర్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో విషయం వెలుగు చూసింది. నిందితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తక్కలపల్లికి చెందిన చిట్యాల సరోజ.. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ తో 2013లో ప్రేమవివాహం చేసుకుంది. కాగా భాస్కర్ సరోజను రెండో పెళ్లి చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సాయి విద్యనగర్ లో గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఆయాన్ (5), హర్ష (3) ఉన్నారు. బాస్కర్ ప్రస్తుతం సొంత కారును డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్యభర్తల తరచూ గొడవలు జరుగుతుండేవి. గత 10రోజులుగా సరోజను ఇంట్లో నుండి వెళ్లిపోవాల్సిందిగా.. ‘నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు’ అని తెగేసి చెప్పి రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు నిందితురాలు తెలిపింది. భర్త తనను, పిల్లలను బ్రతికనివ్వడనీ అందుకే పిల్లలను చంపేసి, తాను చనిపోయేందుకు శనివారం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకుని భాస్కర్ బయటకు వెళ్లిపోయాడు.ఆ కోపంలో ఉన్న సరోజ.. మధ్యాహ్నం 1గంటకు పిల్లలను ఇద్దరినీ బీరు సీసాతో అత్యంత పాశావికంగా పొడిచి చంపింది. అనంతరం తాను చనిపోయేందుకు నిర్ణయించుకుంది ధైర్యం సరిపోక కరీంనగర్ కు వచ్చింది. వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు 4గంటలకు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. కరీంనగర్ పోలీసులు సిద్దిపేట పోలీసులకు సమాచారం ఇచ్చే వరకు కూడా అక్కడ జరిగిన సంఘటన వెలుగులోకి రాకపోలేదు.

First published: May 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...