ANGERED THAT HE HAD AN ILLICIT AFFAIR WITH HIS MOTHER HE STABBED HIM TO DEATH MDK VB
Affair: అక్రమ సంబంధంపై తల్లిని ప్రశ్నించాడు.. సమాధానం రాలేదు.. దీంతో కోపంతో అతడు బెడ్ రూంకి వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
Crime News: ఎప్పుడు తనతో సంతోషంగా ఉంటే తల్లి ఒక్కసారిగా ఫోన్లతో బిజీ అయిపోయింది. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి గురైన సదరు వ్యక్తి ఏం చేశాడో తెలుసా.. వివరాల్లోకి వెళ్తి తెలుసుకుందాం..
తల్లితో పాటు తన కుమారుడు ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్లకు ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ.. కూలీ పనులకు వెళ్తుంటారు. అయితే గత కొంత కాలం నుంచి తల్లి ప్రవర్తనలో మార్పు గమనించాడు కుమారుడు. ప్రతీ రోజూ ఫోన్లో మాట్లాడుతుండగా గమనించి.. ఓ రోజు విషయం తెలుసుకున్నాడు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. మరో సారి ఇలా జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించాడు.
కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నా.. తర్వాత మళ్లీ మొదలైంది. మళ్లీ ఫోన్లు చేసుకోవడం మొదలు పెట్టారు. బయట కూడా కలుసుకుంటుండం అతడికి తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఓ రోజు సదరు వ్యక్తి పొలానికి వెళ్లింది చూసి వెనుక నుంచి వెళ్లి కత్తితో పొడిచి హత్య చేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇదుల నాగులపల్లి గ్రామానికి చెందిన సురేందర్ యాదవ్ అతడి తల్లి నివాసం ఉంటున్నారు. వాళ్లకు ఉన్న పొలంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి సురేందర్ యాదవ్ తల్లికి ఫోన్లు రావడం గమనించాడు. ఆ ఫోన్ అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు గౌడ్ అనే వ్యక్తి ఫోన్ చేయడం గమనించాడు. అతడితో తన తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గమనించాడు. దీంతో అతడు తన తల్లిని మందలించాడు. ఆమె పట్టనట్లుగా ప్రవర్తించింది. ఓ రోజు ఈ వ్యవహారంపై ఆంజనేయులు గౌడ్ ను హెచ్చరించాడు. ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పాడు.
అయినా వినలేదు. మరుసటి రోజు నుంచి ఇలానే సాగుతుండటంతో అతడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఓ రోజు ఆంజనేయులు పొలం వద్దకు వెళ్లడం గమనించాడు. వెంటనే సరేందర్ తన ఇంట్లోని బెడ్ రూంలో ఉన్న కత్తిని పట్టుకొని.. బైక్ పై అతడి వద్దకు వెళ్లి.. ఆంజనేయులుగౌడ్ పై దాడి చేశాడు. అతడి పొట్టలో కత్తితో పొడిచి హత్య చేశాడు. భయంతో అతడు అక్కడ నుంచి పారిపోయాడు. అటుగా వస్తున్న కొంతమంది తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆంజనేయలు గౌడ్ ను స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు .
అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించిన వాళ్లకు అనుమానాస్పదంగా కనబడిన సురేందర్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఈ హత్య తానే చేసినట్లు సరేందర్ యాదవ్ ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తి తో సహా బైక్ ను సీజ్ చేసిన పటాన్చెరు పోలీసులు అనంతరం సురేందర్ యాదవ్ ను రిమాండ్ తరలించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.