Home /News /crime /

ANGERED BY WIFE SWAP PROPOSAL A BUSINESSMAN KILLED BY 2ND WIFE AND SURRENDERED BEFORE POLICE IN KARNATAKA MKS

wife swap : నీ భార్య నాకు, నా భార్య నీకు -కోటీశ్వరుడైన భర్తను బ్యూటీషియన్ ఏం చేసిందంటే..

నిందితురాలు నేత్ర

నిందితురాలు నేత్ర

భారత్ లోనూ వైఫ్ స్వాప్ విష సంస్కృతి పెరిగిపోతున్నట్లు జరుగుతోన్న నేరాలు రుజువుచేస్తున్నాయి. డబ్బులున్న బడాబాబులు తమ లైంగిక వాంఛలు తీసుర్చుకోడానికి భార్యలను ఎరలుగా వాడుకుంటుండటం, ఆడవాళ్లకు ఇష్టం లేకున్నా మగాళ్లే.. నీ భార్య నాకు, నా భార్య నీకు.. అంటూ వంతులేసుకుని వికృతాలకు పాల్పడుతుండటం పెరిగిపోయింది. ఈక్రమంలోనే

ఇంకా చదవండి ...
wife swap.. వైఫ్ స్వాప్.. పచ్చిగా చెప్పాలంటే పెళ్లాల మార్పిడి. ఈ పేరుతో ఏకంగా టీవీ సిరీస్ కూడా ఉందనే విషయం ఆసియా వాసులకు చాలా కాలానికిగానీ తెలీదు. ఎందుకంటే మన వ్యవస్థలో పరాయివాడి భార్య సోదరితో సమానం. భారత్ లోనైతే.. భర్త స్నేహితులు అందరినీ భార్యలు అన్నయ్యా అనే పిలుస్తుంటారు. కాగా, కాలంతోపాటే బంధాలూ ప్రభావితం అవుతూ, భారత్ లోనూ ఈ దుస్సంస్క‌ృతి బలంగా విస్తరిస్తున్నది. ప్రధానంగా బాగా డబ్బులున్న బడాబాబులు తమ లైంగిక వాంఛలు తీసుర్చుకోడానికి భార్యలను ఎరలుగా వాడుకుంటుండటం, ఆడవాళ్లకు ఇష్టం లేకున్నా మగాళ్లే.. నీ భార్య నాకు, నా భార్య నీకు.. అంటూ వంతులేసుకుని వికృతాలకు పాల్పడుతుండటం పెరిగిపోయింది. ఈ విపరీత పరిణామాలకు పర్యవసానాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయిమరి. భారత టెక్ రాజధాని బెంగళూరు సిటీ శివారులో చోటుచేసుకున్న ఓ వైఫ్ స్వాప్ ఉదంత పర్యవసానాన్ని మాదనాయకనహళ్లి పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలివి..

బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తాజాగా దారుణ సంఘటన చోటుచేసుకుంది. రెండో భార్య చేతిలో కోటీశ్వరుడైన రియల్టర్ ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పలార్‌స్వామి అలియాస్‌ స్వామిరాజ్‌ (46)అనే వ్యాపారిని అతని రెండో భార్య అయిన నేత్ర అతిదారుణంగా చంపేసి, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. వృత్తిరీత్యా బ్యూటీషీయన్‌ అయిన నేత్ర తానీ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా పోలీసులకు చెప్పింది.

CM KCR మరో సంచలనం -10రోజుల్లో 19MLCలు వీరేనా, ఇద్దరికి మంత్రి పదవి? -మండలి చైర్మన్‌గా మాజీ స్పీకర్


ఐటీ రంగంతోపాటే బెంగళూరు శివారులోనూ రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరించింది. రియల్టర్ పలార్ స్వామి ఉత్తర బెంగళూరు తాలూకాలో లేఔట్లు వేసి అనతికాలంలోనే కోట్లకు అధిపతి అయ్యాడు. ఒక్కసారే విపరీతమైన డబ్బులు వచ్చేసరికి స్వామికి కొత్త కోరికలూ పుట్టుకొచ్చాయి. అప్పటికే అతనికి పెళ్లై భార్యా, పిల్లలు ఉన్నా, మాదనాయకనహళ్లికి చెందిన బ్యుటీషియన్ నేత్రతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర లైంగిక సంబంధం ఏర్పడింది. ఆరేళ్ల కిందట వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.

నింతితురాలు నేత్ర, హతుడు పలార్ స్వామి

గేటెడ్ కమ్యూనిటీ ఘోరం : అమ్మా.. కొన్ని మంచి నీళ్లు ఇస్తారా అంటూ లోనికెళ్లిన సెక్యూరిటీ గార్డు..


నేత్రను రెండో భార్యగా పెళ్లి చేసుకున్న తర్వాత పలార్ స్వామి ఆమె పేరు మీద హారో క్యాతనహళ్లిలో రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. తాను కూడా అక్కడి నుంచే వ్యాపార కలాపాలు నిర్వహించేవాడు. ఇద్దరు భార్యలను చేసుకున్నా, పలార్ స్వామిలో కామవాంఛ తీరలేదు. తనతోపాటు వ్యాపారం చేసేవారి భార్యలనూ కోరుకున్నాడు. అవతలివాళ్లూ ఇదే బాపతు కావడంతో వైఫ్ స్వాప్ నెట్వర్క్ ఏర్పడింది. పరాయివాడి భార్యను తాను పొందాలంటే, తన భార్యను వేరే వ్యక్తి దగ్గరికి పంపాల్సి ఉండటంతో.. ఆ పని చేయాల్సిందిగా నేత్రపై ఒత్తిడి పెట్టాడు..

Jai Bhim : జై భీమ్ (సినతల్లి) పార్వతమ్మ ఇప్పుడిలా -చలించిన రాఘవ లారెన్స్ -ఆమెకు ఇల్లు కట్టిస్తానంటూ


రెండో భార్య అయినంత మాత్రాన తాను అలాంటి పని చేయలేనని నేత్ర తెగేసి చెప్పింది. కానీ పలార్ స్వామి ఎంతకూ ఒప్పుకోలేదు. వైఫ్ స్వాప్ కోసం ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఇద్దరిమధ్యా మాటామాటా పెరిగి తోపులాట దాకా వెళ్లింది. ఆవేశంలో రెండో భార్య నేత్ర.. పలార్‌స్వామిని రాడ్‌తో గట్టిగా కొట్టేసింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత

మృతుడు పలార్ స్వామి బంగళా, కారు

CM KCR మాటలు నిజం చేస్తారా? -జనవరి 26 తర్వాత మామూలుగా ఉండదు :revanth reddy


నేత్ర నేరుగా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి తాను భర్తను హత్య చేశానని లొంగిపోంది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేసానని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, భర్త హత్య గురించి తెలుసుకున్న మొదటి భార్య.. నేత్ర చెబుతోన్న కారణాలను నమ్మడం లేదు. మొదటి భార్యను, పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే అక్కసుతోనే పలార్ స్వామిని నేత్ర అంతం చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bengaluru, Crime news, Karnataka, Wife kills husband

తదుపరి వార్తలు