నేలకూలిన హోర్డింగ్... ప్రాణాలు కోల్పోయిన యువతి

Tamilnadu : హోరుగాలి రాగానే... హోర్డింగులు కూలిపోవడం మనం చూస్తున్నాం. అలాంటి దారుణం చెన్నైలో జరిగింది. దురదృష్టం కొద్దీ హోర్డింగ్ కూలినప్పుడు ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 2:19 PM IST
నేలకూలిన హోర్డింగ్... ప్రాణాలు కోల్పోయిన యువతి
శుభశ్రీ (Image : Twitter)
  • Share this:
Hoarding Kills Techie : అది చెన్నైలోని పల్లవరం రోడ్డు. ఎప్పట్లాగే... కాస్త రద్దీగా ఉంది. సడెన్‌గా అడ్డకున్న భారీ హోర్డింగ్ నేలకొరిగింది. ఆ సమయంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న 23 ఏళ్ల శుభశ్రీ అక్కడే ఉంది. తన షిఫ్ట్ అయిపోగానే స్కూటీపై ఇంటికి వెళ్లసాగింది. కరెక్టుగా హోర్డింగ్ కూలుతున్న సమయంలో... ఆమె స్కూటీ దాని కిందకు వెళ్లినట్లైంది. అంత భారీ హోర్డింగ్ పడటంతో... ఆమె ఒక్కసారిగా స్కూటీతో సహా కింద పడిపోయింది. దొర్లుతూ రోడ్డు మధ్యలోకి వెళ్లిపోయింది. సరిగ్గా అప్పుడే... వెనక నుంచీ వచ్చిన వాటర్ ట్యాంకర్... ఆమె పైనుంచీ వెళ్లింది. అంతా సినిమాల్లో చూపించినట్లు క్షణాల్లో జరిగిపోయింది. ఇదంతా చూసిన స్థానికులు... ఆమెను గబగబా ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

హోర్డింగ్ పెట్టిందెవరు : అన్నాడీఎంకేకి చెందిన నేత జయగోపాల్ బంధువుల పెళ్లికి... తమిళనాడు డిప్యూటీ సీఎంని ఆహ్వానిస్తూ... ఆ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆహ్వానం పలకాలంటే... వెడ్డింగ్ కార్డు ఇస్తే సరిపోయేది. కావాలని నానా హంగామా చేశారు. హోర్డింగులో తమిళనాడు మాజీ సీఎం జయలలిత, ఇప్పటి సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఫొటోలు పెట్టారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేంటంటే... ఇది అధికారికంగా పెట్టిన హోర్డింగ్ కాదు. అనధికారికంగా పెట్టినది. ప్రస్తుతం ఇది తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ హోర్డింగ్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శుభశ్రీ కుటుంబసభ్యులు, బంధువులు, ప్రజలు కోరుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... హోర్డింగ్ ఎవరు పెట్టారో తేల్చో పనిలో పడ్డారు.

ఈ విషయంపై ప్రతిపక్ష DMK కూడా స్పందించింది. అనధికారిక హోర్డింగ్ వల్ల ఓ నిండు ప్రాణం పోయిందంటూ మండిపడింది. దీనికి ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, అందరిదీ బాధ్యత అని ఫైర్ అయ్యారు DMK చీఫ్ ఎంకే స్టాలిన్. శుభశ్రీ కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. సోషల్ మీడియాలో శుభశ్రీకి మద్దతుగా ఉద్యమం మొదలైంది. ఆమె మరణానికి కారణం ఎవరని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు