హోమ్ /వార్తలు /క్రైమ్ /

డాక్టర్ నిర్లక్ష్యంతో హిందూపురంలో దారుణం...

డాక్టర్ నిర్లక్ష్యంతో హిందూపురంలో దారుణం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హిందూపురంలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ అంగన్వాడి వర్కర్ మృతి చెందిందని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు మృతదేహంతో ధర్నా చేశారు.

  అనంతపూర్ జిల్లా హిందూపురం పట్టణంలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వహించిన ఆపరేషన్ వికటించి ఓ అంగనవాడి మహిళా వర్కర్ మృతి చెందిందని ఆరోపిస్తూ ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు మృతదేహంతో ధర్నా చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గత ఇరవై రోజుల క్రితం సోమందేపల్లి కి చెందిన అలివేలమ్మ (35) అనే అంగన్వాడీ వర్కర్ తలనొప్పి బాధతో చికిత్స నిమిత్తం హిందుపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే తలనొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చిన ఆమెకు మీకు ముక్కులో గడ్డలు ఉన్నాయి. అందుకే తలనొప్పి వచ్చిందని డాక్టర్ తెలిపారు. ఆపరేషన్ చేయించుకుంటే నయమవుతుందని డాక్టర్ సూచించినట్లు తెలిపారు. డాక్టర్ సూచనమేరకు రూ.50 వేలు చెల్లించి ముక్కు ఆపరేషన్ చేయించారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యం కారణంతో సక్రమంగా ఆపరేషన్ నిర్వహించకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగిందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రి తీసుకుని వచ్చి డాక్టర్ కు చూపించామని, అయితే ఇక్కడ ఆ వైద్యం చేయడానికి వీలులేదు మీరు కర్నూల్ కి వెళ్ళండి అని అతనే స్వయంగా అంబులెన్స్ ఏర్పాటుచేసి పంపించారని బాధితులు చెబుతున్నారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గ మధ్యంలోనే ఆమె మృతి చెందిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

  ఇదిలా ఉండగా సిపిఐ, సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో డాక్టర్ నిర్లక్ష్యంతోనే అంగన్వాడీ వర్కర్ అలివేలమ్మ మృతి చెందిందని ఆరోపిస్తూ అమృత దేహంతో ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వ్యాధి ఒకటైతే ఆపరేషన్ మరో వ్యాధికి చేశారని, డాక్టర్ నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Anantapuram, Andhra Pradesh, Hindupuram

  ఉత్తమ కథలు