తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన హ్యాకర్లు... విద్యుత్ వెబ్‌సైట్స్ హ్యాక్... రూ.35 కోట్లు డిమాండ్...

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL), ఉత్తర తెలంగాన విద్యుత్ పంపినీ సంస్థ (TSNPDCL), దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL), తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL)లకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేసిన అంతర్జాతీయ హ్యాకర్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 10:04 PM IST
తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన హ్యాకర్లు... విద్యుత్ వెబ్‌సైట్స్ హ్యాక్... రూ.35 కోట్లు డిమాండ్...
తెలుగు రాష్ట్రాలకు షాక్ ఇచ్చిన హ్యాకర్లు... విద్యుత్ వెబ్‌సైట్స్ హ్యాక్... రూ.35 కోట్లు డిమాండ్...
  • Share this:
సైబర్ క్రైమ్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తెలుగు రాష్ట్రాలనే టార్గెట్ చేస్తూ రెండు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సరఫరా సంస్థల వెబ్‌సైట్లను హ్యాక్ చేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL), ఉత్తర తెలంగాన విద్యుత్ పంపినీ సంస్థ (TSNPDCL), దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL), తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL)లకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేశారు హ్యాకర్లు. ఈ పని స్థానికంగా ఉండే హ్యాకర్లది కాదు... అని అంతర్జాతీయ హ్యాకర్స్ చేసిన పనేనని తేల్చారు సైబర్ క్రైమ్ నిపుణులు. ర్యాన్‌సమ్‌వేర్ వైరస్ ద్వారా ఈ ప్రభుత్వ పవర్ సప్లై సంస్థల సర్వర్లలో ఉన్న డేటాను మొత్తం దొంగిలించిన హ్యాకర్లు... వెబ్‌సైట్స్‌లో ఉన్న పూర్తి డేటాను తొలగించారు. ఈ సమాచారం వెనక్కి కావాలంటే రూ.35 కోట్లు చెల్లించాలంటూ తెలుగు రాష్ట్రాలను డిమాండ్ చేశారు ఇంటర్నేషన్ ప్రొఫెషనల్ హ్యాకర్స్.

అయితే హ్యాకర్ల నుంచి ఈ ప్రమాదాన్ని ముందే ఊహించిన అధికారులు... డేటాను బ్యాకప్ చేసి భద్రపరిచారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తెలుగు రాష్ట్రాల డిస్కంల అధికారిక వెబ్‌సైట్ల హ్యాకింగ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు. సమాచార చట్టం ప్రకారం కేసు నమోదుచేసుకున్న సైబర్ క్రైమ్ టీమ్... దర్యాప్తు ప్రారంభించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.First published: May 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు