పెద్దవాళ్లు ఒప్పుకోకున్నా.. తాను పెండ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి యువతిని మోసం చేశాడో కానిస్టేబుల్. బుధవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
బాధితురాలి వివరాల మేరకు.. రాప్తాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గ్రామ పోలీసుగా విధులు నిర్వహిస్తోంది. తాడిపత్రిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే యువకుడితో 6 నెలల కిందట ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి. ఇంట్లో పెద్దలకు నచ్చలేదని సంబంధం వద్దనుకున్నారు. కానీ సదరు కానిస్టేబుల్ మాత్రం యువతిని ప్రేమిస్తున్నానని, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెప్పాడు.
ఇటీవల అతను తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో ఆ యువతి అతనితో మాట్లాడేందుకు బుధవారం తాడిపత్రికి వచ్చింది. కానీ ఆ కానిస్టేబుల్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. బస్టాండ్ కు వెళ్లి కుమిలిపోతూ.. వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మిగింది. ఇది గమనించిన ప్రయాణికులు యువతిని తాడిపత్రి ప్రభత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను అనంతపురం తీసుకెళ్లారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని పట్టణ సీఐ తేజమూర్తి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Love cheating