Home /News /crime /

Andhra Pradesh: అనూష కుటుంబానికి 21 రోజుల్లోనే న్యాయం..? ప్రభుత్వ హామీ ఇదే..

Andhra Pradesh: అనూష కుటుంబానికి 21 రోజుల్లోనే న్యాయం..? ప్రభుత్వ హామీ ఇదే..

అనూష, విష్ణువర్ధన్ రెడ్డి (ఫైల్ ఫొటోలు)

అనూష, విష్ణువర్ధన్ రెడ్డి (ఫైల్ ఫొటోలు)

Anusha Murder: అనూష కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 2 సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించారు.

  ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష దారుణ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డిని ఊరితీయాలని కొందరు, ఎన్ కౌంటర్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూష కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. అనూష కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం జగన్ కూడా ఈ కేసులో బాధితులకు త్వరగా న్యాయం జరగాలని చెప్పారని ఆమె వివరించారు. అనూషను దారుణంగా చంపిన విష్ణువర్ధన్ రెడ్డికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని తెలిపారు. అనూష కుటుంబాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పరామర్శించారు. కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 2 సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ బాధిత కుటుంబానికి అందజేశారు.

  గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన కోట అనూష, బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదవుతున్నారు. కొన్నాళ్లుగా వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే అనూష మరో యువకుడితో చనువుగా ఉంటోందని, అతడితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతూ, చాటింగ్ చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డికి అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడవద్దంటూ అనూషపై అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో అనూష దూరం పెట్టింది. ఈ క్రమంలో అనూషపై కక్ష పెంచుకున్నాడు.

  రెండు రోజులుగా కాలేజీకి కూడా రాని విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం అనూషకు కాల్ చేశాడు. అప్పటికే అనూష కాలేజీకి ఆటోలో వెళ్తోంది. అయితే మాట్లాడాల్సి ఉందని, కలవాలని విష్ణు కోరాడు. దీంతో ఆమె కాలేజీకి వెళ్లకుండా అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఇద్దరూ కలిసి ఓ ఆటోలో నరసరావుపేట మండలం పాలపాడు వరకు వెళ్లారు. ఆ తర్వాత ఆటోను వెనక్కు పంపేశాడు. ఇద్దరూ సాగర్ కాలువ వరకు నడుచుకుంటూ వెళ్లారు. మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా విష్ణు ఆమె చున్నీని లాగేశాడు. అదే చున్నీతో ఆమెకు ఉరిబిగించి చంపేశాడు. కాలువ పక్కన ఉన్న చెత్తకుప్పలో ఆమె మృతదేహాన్ని కప్పెట్టాడు. ఆ తర్వాత నేరుగా నరసరావుపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడు చెప్పిన వివరాలను బట్టి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  అదే అసలు కారణమా..?
  కాగా, అదే కాలేజీలో చదివే మరో అబ్బాయితో అనూష చనువుగా ఉండటాన్ని విష్ణు భరించలేకపోయాడు. ఆ విషయంలోనే ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్, మెసేజ్ ల రూపంలో వాగ్వాదం జరిగినట్టు, ఆమె మొబైల్ చాటింగ్ లో పంపించిన మెసేజ్ లు కూడా ఈ దారుణానికి కారణమయి ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అనూష, విష్ణు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడాలని ముందునుంచే అనుకున్నాడని తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap government, Crime, Crime news, Guntur, Love, Love affiar, Murder, Narasaraopet, Vasireddy Padma

  తదుపరి వార్తలు