చదువులు చెప్పే విద్యాలయాలను దేవాలయలుగా భావిస్తాం. అలాంటి దేవాలయల్లో కొందరు కీచకులు కూడా ఉంటారు అనటానికి నిదర్శనం ఈ కథనం. గుంటూరు జిల్లా కారంపూడిలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను వేదిస్తున్నాడని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని అదే పాఠశాలలో పనిచేస్తున్న ఆర్. జయలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత 12 సంవత్సరాలుగా ఉపాయధ్యాయురాలు జయలక్ష్మి ఇదే పాఠశాలలో పనిచేస్తుంది. అయితే స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల తనను బెదిరించి బలవంతంగా తెల్ల కాగితాల మీద సంతకం చేపించుకొని వేదిస్తున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. కరస్పాండెంట్కు మద్దతుగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాద్యాయుడు శేర్పనీ కూడా తనని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
ఇక, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే పల్నాడు ప్రాంతంలోనే ఎంతో ప్రాముఖ్యత గల పాఠశాల. కరస్పాండెంట్ అంటోనీ బాల పాఠశాలలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎంతోమంది మహిళలు ఉపాధ్యాయులపై వేధింపులకు గురిచేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. కొంతమంది చెప్పుకోలేక పాఠశాలలో పనిచేయలేక బయటకి వెళ్లినట్లు సమాచారం. ఇలాంటి కీచక కరస్పాండెంట్ వలన విద్యాసంస్థలకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఇటీవల అంతర్జాతీయ మహిళ దినోత్సవన్ని పురస్కరించుకొని ఇదే పాఠశాలలో న్యాయ సదస్సు ను నిర్వహించారు. న్యాయసదస్సులో పెద్దలు చెప్పిన మాటలు విన్న కానీ ఇలాంటి వ్యక్తుల్లో ఎటువంటి మార్పు రాలేదు అనే చెప్పవచ్చు. ఉపాధ్యాయ వృత్తికే కలంకంగా మారిన కారంపూడి కరస్పాండెంట్ పై చర్యలు తీసుకొని మహిళలు వేధింపులకు గురికాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్థానికులు కోరుతున్నారు.. ఇదిలా ఉండగా ఉపాధ్యాయురాలు ఆర్. జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ అంటోనీ బాల అతనికి సహకరించిన ఉపాద్యాయుడు శేర్పనీ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కారంపూడి ఎస్ఐ గల్లా రవికృష్ణ తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.