ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని చండూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణి, అదే స్టేషన్ పనిచేసిన కానిస్టేబుల్ రవీంద్ర పురుగుల మందుతాగి ఆత్మహత్య యత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రావణి గతేడాది అక్టోబర్‌లో చండూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు రవీంద్ర గత ఐదేళ్ల నుంచి అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే శ్రావణితో రవీంద్ర సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం. మరోవైపు ఒకరోజు ముందు కానిస్టేబుల్ రవీంద్ర వీఆర్‌లోకి వెళ్లారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. శ్రావణి, రవీంద్రలు ఆత్మహత్యకు యత్నించారు.
ఈ ఘటన ప్రస్తుతం జిల్లా పోలీసుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎస్ఐ శ్రావణి శనివారం పోలీస్ స్టేషన్‌కు రాలేదని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. శ్రావణి, రవీంద్రలు ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడరనే విషయం తెలియదన్నారు. ఆత్మహత్యకు యత్నించిన అనంతరం వారిద్దరు కారులో తెనాలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు.
ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరులోని వేర్వేరు ప్రైవేట్ ఆస్పత్రులకు వారిని తరలించినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం వారిద్దరు చికిత్స పొందుతున్నారని.. ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.