Home /News /crime /

ANDHRA PRADESH WOMAN MOLESTED BY A GOVERNMENT TEACHER IN GUNTUR DISTRICT SU

Andhra Pradesh: కీచక ఉపాధ్యాయుడు.. కోరిక తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్ నాశనం చేస్తా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.

    విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడి బుద్ది వక్రమార్గం పట్టింది. తన కోరిక తీర్చాలంటూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. లేకుంటే ఆమె పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలను విక్రయిస్తుంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు ఆ మహిళపై కన్నేశాడు. శనివారం సాయంత్రం తన పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళను శ్రీనివాసరావు వెంబండించాడు. ఆమె ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

    కోరిక తీర్చకపోతే తాను చదువు చెప్పే స్కూల్‌లోనే చదువుతున్న ఆమె పిల్లల భవిష్యత్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. నన్నే వద్దంటావా అంటూ మహిళతో ఘర్షణకు దిగాడు. ఇది చూసి అడ్డువచ్చిన మహిళ తల్లిదండ్రులపై దాడి చేశాడు. వారిని కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

    ఈ ఘటనపై మహిళ కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానికులు ఆందోళన చేపట్టారు. మహిళతో అనూచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చేస్తూ ఆదివారం బెల్లంకొండ క్రాస్‌ రోడ్డు వద్ద ధర్నా చేపట్టారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Molestation, Teacher misbehave

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు