ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కాకినాడలో గ్యాస్ సిలిండ్ పేలిన ఘటనలో మూడు పూరిళ్లు దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయింది. ఈ ప్రమాదంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. వివరాలు.. కాకినాడలోని ఎల్విన్పేటలో విజయలక్ష్మి అనే మహిళ ఓ పూరిగుడిసెలో ఒంటరిగా ఉంటుంది. శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచిన ఆమె లైట్ స్విచ్ ఆన్ చేసింది. అయితే అప్పటికే ఆ గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ లీకవ్వడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆమె మంటల్లో సజీవ దహనమైంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంతో పక్కనే ఉన్న మరో రెండు గుడిసెల్లోని వారు బయటకు పరుగులు తీశారు.
ఇక, మంటలు వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న రెండు గుడిసెలకు అంటుకున్నాయి. అప్పటికే ఆ గుడిసెల్లోని వారు బయటకు వచ్చి ఉండటంతో వారికి ప్రమాదం తప్పింది. అయితే ఆ రెండు గుడిసెల్లో ఉన్న వస్తువులు అగ్నికి అహుతయ్యాయి. గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.