ఆంధ్రప్రదేశ్లో ఓ మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ అనుమానస్పద స్థితిలో మృతిచెందింది. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం రాజుపాలేనికి చెందిన చెరుకూరి సింధు (29) సీఏ పూర్తి చేసి.. ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం కిందట ఆమెకు విజయవాడ సమీపంలోని పోరంకికి చెందిన కె.ప్రసేన్తో సింధుకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరు పెళ్లిచేసుకోవడానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు.
ఇక, గతేడాది లాక్డౌన్ నుంచి సింధు గంగిరెద్దుల దిబ్బలోని ప్రసేన్ కుటుంబానికి చెందిన మరో ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. అయితే గత రెండు రోజల నుంచి సింధుకు ఆమె తల్లి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో సింధు తల్లి ఆందోళన చెందింది. వెంటనే ప్రసేన్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అతడు సింధు ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లాడు. అయితే సింధు ఎంతసేపటికీ.. తలుపు తీయలేదు. దీంతో ప్రసేన్ కిటికీలో నుంచి చూడగా.. సింధు మృతిచెంది కనిపించింది. వెంటనే ప్రసేన్.. సింధు తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
వెంటనే తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సింధును అలా చూసి తల్లడిల్లిపోయారు. ఇందుకు సంబంధించి మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. సింధు తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసలు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకన్నారు. సింధు మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరోవైపు.. సింధు సింధు మృతదేహంపై గాయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సింధు వేసుకుని చనిపోయేంత పిరికి వ్యక్తి కాదని.. ప్రసేన్ ప్రేమ పేరుతో మోసం చేసి తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్టుగా పోలీసులు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.