Andhra Pradesh: కూతురు భర్తతో శారీరక సంబంధం పెట్టుకున్న తల్లి.. అతడితో కలిసి ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ మహిళ కూతురు భర్తతో శారీరక సంబంధం పెట్టుకుంది. గత మూడేళ్లుగా వీరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.

  • Share this:
    ఓ మహిళ కూతురు భర్తతో శారీరక సంబంధం పెట్టుకుంది. గత మూడేళ్లుగా వీరు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. చివరకు ఇది ఓ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్టీకాలనీలో నాగరాజు, మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కూతురు రాణిని.. బంగారుపాళ్యం మండలం చిట్టేరికి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే మంజులు కూతురు ఇంటికి వెళ్లడం చేస్తుండేది. కూతురు, అల్లుడు కూడా ఆమె ఇంటికి వస్తుండేవారు. ఈ క్రమంలోనే అల్లుడు సుబ్రహ్మణ్యంతో మంజుల శారీరక సంబంధం పెట్టుకుంది. మూడేళ్ల నుంచి వీరి మధ్య రిలేషన్ కొనసాగుతుంది.

    ఇక, వారం రోజుల కింద సోమల మండలం ఇర్లపల్లెలో కాపురం ఉంటున్న కూతురు రాణి ఇంటికి మంజుల వచ్చింది. అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలోనే గత ఆదివారం నాగరాజు.. భార్య కోసం కూతురు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే నాగరాజుపై మంజుల కోపం పెంచుకుంది. అల్లుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని మంజల భావించింది. ఇదే విషయాన్ని అల్లుడికి చెప్పింది. దీంతో మంజుల, సుబ్రహ్మణ్యం కలిసి.. నాగరాజును హత్య చేయాలని ప్లాన్ చేశారు.

    ఆ తర్వాత ప్లాన్ ప్రకారం.. నాగరాజును కంచెంవారిపల్లె సమీపంలో అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ అతిగా మద్యం తాగించి.. కొట్టి చంపేశాడు. అనంతరం వడ్లవాడి కుంటలో పడేసి వెళ్లిపోయారు. ఇక, అక్కడ నాగరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ జరిగిన పోలీసులు మంజుల, సుబ్రహ్మణ్యంలను నిందితులుగా గుర్తించారు. శనివారం వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టుగా పోలీసులు వెల్లడించారు.
    Published by:Sumanth Kanukula
    First published: