HOME »NEWS »CRIME »andhra pradesh vijayawada astrologer booked for cheating telangan woman of rs 50 lakh nk

విజయవాడలో దారుణం... మహిళను అడ్డంగా మోసంచేసిన జ్యోతిష్యుడు?

విజయవాడలో దారుణం... మహిళను అడ్డంగా మోసంచేసిన జ్యోతిష్యుడు?
విజయవాడలో దారుణం... మహిళను అడ్డంగా మోసంచేసిన జ్యోతిష్యుడు?

Andhra Pradesh | Vijayawada : ఓ జ్యోతిష్యుడు... మహిళను ఎలా మోసం చేశాడు? ఆమె రూ.75 లక్షలు ఎలా నష్టపోయింది? ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకుందాం.

  • Share this:
    Andhra Pradesh | Vijayawada : విజయవాడకు చెందిన అచ్చి రెడ్డి... ఓ జ్యోతిష్య కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన... ఖమ్మంకి చెంందిన సుభద్ర నుంచీ రూ.50 లక్షలు మనీ తీసుకున్నారు. నెలకు రూ.2.5 లక్షలు చెల్లిస్తానన్నారు. డబ్బు ఇచ్చినందుకు తన భార్యకు ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో పార్ట్‌నర్‌షిప్ ఇప్పిస్తానన్నారు. నిజమే అనుకున్న సుభద్ర డబ్బు ఇచ్చి మోసపోయినట్లైంది. సూర్యాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది సుభద్ర. ఆమె జీవితంలో కొన్ని అసంతృప్త సమస్యలు ఉండటాన్ని తెలుసుకున్న పక్కింటి వాళ్లు... అచ్చి రెడ్డిని కలవమని సలహా ఇచ్చారు. అచ్చి రెడ్డిని కలిసింది. దోషం ఉందన్న ఆయన... కాళసర్వ దోష నివారణ పూజ చేయిస్తానన్నాడు. అందుకోసం రూ.60వేలు తీసుకున్నాడు. పూజ అయ్యింది. ఫలితం రాలేదు. మళ్లీ కలిసింది. ఈసారి మరిన్ని పూజలు చేయిస్తానన్నాడు. రూ.2.5లక్షలు అడిగాడు. ఇచ్చింది. పూజలు జరిగాయి. ఫలితం శూన్యం.

    ఇంతలో సుభద్ర... ఓ ఫ్లాట్ లేదా ల్యాండ్ కొనాలనుకుంది. ఏం చెయ్యాలి అని అచ్చి రెడ్డిని అడిగింది. అలా చెయ్యొద్దన్న అచ్చి రెడ్డి... తన భార్య సాఫ్ట్‌వేర్ కంపెనీలో పెట్టుబడి పెట్టమన్నాడు. అందుకు బదులుగా ఆమెను కంపెనీ డైరెక్టర్లలో ఒకరిగా చేస్తాననీ, నెలకు రూ.2.5లక్షల ఆదాయం వచ్చేలా చేస్తానని అన్నాడు. సరే అంది. మొత్తం రూ.75 లక్షలు అడిగాడు. వేర్వేరు సందర్భాల్లో మొత్తం రూ.50 లక్షలు ఇచ్చింది. డబ్బు లేకపోతే నగలైనా పర్వాలేదంటూ... బంగారం, వెండి నగలు తీసుకున్నాడు. మిగతా డబ్బు కోసం కొన్ని ప్రామిసరీ నోట్లు కూడా తీసుకున్నాడు. అలా మొత్తంగా రూ.75 లక్షలు తీసుకున్నట్లైంది.



    అంతా అయ్యాక... తన డైరెక్టర్ పోస్టూ... నెలవారీ డబ్బు గురించి అడిగింది. అచ్చి రెడ్డి అనుచరులు సుబ్రహ్మణ్యం, వెంకట రత్నం మధ్యలో ఎంటరయ్యారు. అచ్చి రెడ్డితో శారీరక సంబంధం పెట్టుకోమని వాళ్లు కోరినట్లు సుభద్ర ఆరోపించారు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో... అచ్చి రెడ్డి, అతని కుటుంబ సభ్యులు, అతని అనుచరులు... తనను చంపేస్తానని బెదిరించారని సుభద్ర చెబుతున్నారు. తన నుంచీ తీసుకున్న ప్రామిసరీ నోట్లను ఉపయోగించి... తనపై నకిలీ కేసు పెట్టినట్లు సుభద్ర ఆరోపించారు. ఇవన్నీ విన్న ఖమ్మం వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేష్... కేసు రాశారు. IPCలోని 420, 354(A), 406, 506, 509 సెక్షన్ల కింద... కేసు రాశారు. దర్యాప్తు మొదలైంది.

    మొత్తం క్లారిటీగా తెలిసిందిగా. మనకు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే... సుభద్ర చెప్పేది నిజమే అయితే... అంత తేలిగ్గా ఆమె అచ్చి రెడ్డి ఉచ్చులో ఎలా చిక్కుకుంది అనిపిస్తుంది. ఎనీహౌ... పోలీసులు నిజాయితీగా దర్యాప్తు జరిపి... ప్లస్సులూ, మైనస్సులూ తేల్చి... బాధితులకు న్యాయం చెయ్యాల్సిన అవసరం ఉంది. అలా జరుగుతుందని కోరుకుందాం.
    Published by:Krishna Kumar N
    First published:March 08, 2020, 13:12 IST