Home /News /crime /

ANDHRA PRADESH TURNING AS DRUGS HUB AS GANZAI CEASED IN UP SMUGGLING FROM AP PRN GNT

Drugs Mafia in AP: డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా ఏపీ..? దీని వెనుకున్న కింగ్ పిన్ ఎవరు..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ (Gujarath) లోపట్టుబడిన హెరాయిన్ (Heroin) విజయవాడ (Vijayawada) చిరునామాతో ఉండటంతో ఏపీ ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య కూడా మాటలతూటాలు పేలాయి. తాజాగా మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది.,

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ (Gujarat) లోపట్టుబడిన హెరాయిన్ విజయవాడ (vijayawada) చిరునామాతో ఉండటంతో ఏపీ ఉలిక్కిపడింది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య కూడా మాటలతూటాలు పేలాయి. ఈ రోజు లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేలో ఆంధ్ర నుండి ఢిల్లీ వెళుతున్న గంజాయిని పట్టుకోవటంతో మత్తుపదార్ధాలకు ఆంధ్ర ప్రదేశ్ అడ్డాగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా డ్రగ్ స్మగర్లు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏదో ఓ తీరుగా ఒక్కో రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇలా దేశమంతా గంజాయి, మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరాది రాష్ట్రానికి తరలిస్తోన్న భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు చేశారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్.

  ఏకంగా 972 కేజీల గంజాయి అక్రమ రవాణాను గుర్తించి, చాకచక్యంగా పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో గంజాయి రవాణా, డ్రగ్స్ సరఫరా వివాదం నడుస్తుండగా ఏపీ నుంచి ఉత్తరాదిన యూపీకి తరలిస్తోన్న గంజాయిని డీఆర్ఐ అధికారులు సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గంజాయి స్మగ్లింగ్ గురించి ముందుగానే సమాచారం అందుకున్న డీఆర్ఐ టీమ్ యూపీలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో ఏపీ నుంచి ఓ ట్రక్కులో రహస్యంగా గంజాయి తరలిస్తుండగా లక్నో సమీపంలో డ్రగ్స్ సరఫరా ముఠాను గుర్తించారు.

  ఇది చదవండి: ఆ విషయంలో జగన్ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత..? మొదటికే మోసం రానుందా..?


  అనుమానం వచ్చి ట్రక్కును పరిశీలించగా మొదట్లో అందులో ఏమీ లేదని డీఆర్ఐ అధికారులు భావించారు. కానీ క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు షాక్ తిన్నారు. అందులో ప్యాకెట్ల రూపంలో ప్యాకింగ్ చేసి తరలిస్తోన్న గంజాయిని గుర్తించారు. ట్రక్కులో గంజాయి తరలిస్తోన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ట్రక్కును, 972 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం కింద ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.

  ఇది కూడా చదవండి: ఈ నీచుడ్ని ఏం చేసినా తప్పులేదు..! వద్దు బాబాయ్ తప్పు అన్నా వినలేదు.. కూతురులాంటి బాలికపై..,


  డ్రగ్స్, గంజాయి జాడ్యం ప్రస్తుతం రాష్ట్రాన్నిపట్టిపీడిస్తోందని, సదరు అంశం పోలీస్ దర్యాప్తులో ఉందని, అలీషా అనేవ్యక్తి సముద్రపు డాన్ అని, అతనుప్రస్తుతం పోలీస్ వారి విచారణలోఉన్నాడనే వార్తలు పత్రికల్లో వచ్చాయని, ఈ మత్తుపదార్థాల వ్యవహారంపై పోలీస్ శాఖ విచారించాక నిర్ధారణకువచ్చిందా..? లేదా..? అన్నదే సందేహమని, సదరుశాఖ ఎందుకు తత్తరపడుతోందో తెలియాలని ప్రతిపక్షం టీడీపీ ప్రశ్నిస్తోంది. “ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిరవాణా-దేశంలో ఎక్కడ గంజాయిదొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వి కావడం మామూలైపోయింది” కనకమేడల రమేష్ కుమార్ ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: అత్తింటి వేధింపులు భరించలేని అల్లుడు.. ఫేస్ బుక్ లైవ్లో తన ఆవేదన చెప్పి ఏం చేశాడంటే..!


  తరచూ ఆంధ్రా-తెలంగాణ బోర్డ్, విశాఖ ఏజెన్సీ, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. ఈ మధ్య లిక్విడ్ గంజాయి దొరుకుతుండటంతో స్మగ్లర్లు సరికొత్త దారిలో వెళ్తున్నారని అర్థమవుతోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Drugs, Ganja case

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు