హోమ్ /వార్తలు /క్రైమ్ /

Transgender Murder: హిందూపురంలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య.. ఆ పరిచయమే కొంపముంచింది..!

Transgender Murder: హిందూపురంలో ట్రాన్స్‌జెండర్ దారుణ హత్య.. ఆ పరిచయమే కొంపముంచింది..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

హిందుపురంలో ఓ ట్రాన్స్‌జెండర్ దారుణ హత్యకు గురైంది. పరిచయం ఉన్న వ్యక్తే గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు.

  ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో హిందూపురంలో ఓ ట్రాన్స్‌జెండర్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడు ట్రాన్స్‌జెండర్ గొంతుకోసి కిరాతకంగా హత్య చేశాడు. హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద కొత్తగా నిర్మాణ పనులు చేపడుతున్న జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం యర్రగుంటపల్లి చెందిన ట్రాన్స్‌జెండర్‌ నిహారిక హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగా కొంతమేర డబ్బులు కూడా పొగేశారు. అయితే గతకాలంగా నిహారిక అదే గ్రామానికి చెందిన రాజశేర్‌తో చనువుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే నిహారిక తాను దాచుకున్న రూ. 3 లక్షలను రాజశేఖర్‌కు ఇచ్చింది.

  అయితే శుక్రవారం రాత్రి రాజశేఖర్, నిహారిక కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో వారి మధ్య గొడవ జరిగింది.. ఇది కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో తీవ్ర ఆవేశానికి గురైన రాజశేఖర్.. నిహారిక గొంతు కోశాడు. హత్య చేసిన తర్వాత.. నిహారిక మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం ఘటన స్థలానికి చేరుకున్నారు. వన్ టౌన్ సీఐ బాలమద్దిలేటి అక్కడి పరిసరాలను పరిశీలించారు.

  కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రాజశేఖర్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Murder, Transgender

  ఉత్తమ కథలు