ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. జిల్లాలోని గార్లదిన్నె మండలం ఎర్రగుంట్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను రామకృష్ణ(43), అతని భార్య రాజేశ్వరి(38), వారి కుమారుడు(14)గా గుర్తించారు. రాత్రి పూట విష గుళికలు మింగి వీరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం స్థానికకులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో ఎర్రగుంట్ల గ్రామంలో విషాదం నెలకొంది. అయితే వారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.