• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • ANDHRA PRADESH THEFTS ROBBED STEEL PLANT EMPLOYEE IN CINEMA STYLE VICTIM HANDED OVER HIS GOLD BY BELIEVE THEM AS POLICE IN VISAKHAPATNAM PRN

Andhra Pradesh: వీళ్లు చాలా తెలివైన దొంగలు.., పట్టపగలు నడిరోడ్డుపై సినిమా చూపించారు

Andhra Pradesh: వీళ్లు చాలా తెలివైన దొంగలు.., పట్టపగలు నడిరోడ్డుపై సినిమా చూపించారు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విశాఖపట్నం (Visakhapatnam)లో ఘరానా దోపిడీ జరిగింది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని దొంగలు దోచేశారు.

  • Share this:
    నిత్యం అక్కడక్కడా సినీ ఫక్కీలో దొంగతనాలు జరగుతుంటాయి. పదిరూపాయల నోటు విసిరేసి లక్షలు దోచుకెళ్లడం... మత్తు బిస్కెట్లు ఇచ్చి నిలువుదోపిడీ చేయడం.., నోట్ల మార్పుడు, బంగారానికి మెరుగు పెట్టడం ఇలా చాలా రకాలుగా దోపిడీలు జరుగుతుంటాయి. కానీ విశాఖలో మాత్రం ఓ వెరైటీ చోరీ జరిగింది. సినిమా స్టైల్లో దొంగలు ఓ స్టీల్ ప్లాంట్ ఉద్యోగికి నిలువుదోపిడీ చేశారు. వివరాల్లోకి వెళ్తే దువ్వాడ రోడ్డులో ఉంటున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కృష్ణారావు.., ఆఫీస్ కు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులమంటూ నమ్మించి మాయమాటలు చెప్పారు. దొంగలున్నారు జాగ్రత్తా అంటూ అతడ్ని బుట్టలో వేశారు. ఒంటిమీద బంగారం జాగ్రత్త చేసుకోమని ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఒంటిమీదున్న బంగారం తీసి కర్చీఫ్ లో కట్టుకొని దాచుకోవాలని చెప్పారు.

    అంత చనువుగా జాగ్రత్తలు చెప్తున్న ఈ పోలీసులు చాలా మంచోళ్లని కృష్ణారావు నమ్మాడు. వారి మాయమాటలు నమ్మిన కృష్ణారావు.., ప్రియమైన నీకు సినిమాలో వేణుమాధవ్ మాదిరిగా నగలన్నీ తీసి కర్చీఫ్ లో మూటగట్టాడు. అతడు కర్చీఫ్ లో నగలు మూటగట్టాడో లేదో.. నాలుగు తులాల బంగారాన్ని తీసుకొని ఉడాయించారు. దీంతో కృష్ణారావు లబోదిబోమంటూ దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్ లను తనిఖీ చేస్తున్నారు. అలాగే విశాఖలో ఇటీవల నమోదైన చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుల ఫోటోలను గుర్తించాల్సిందిగా కృష్ణారావుకు సూచించారు. గతంలో నడుచుకుంటూ వెళ్లేవారి మెడల్లో చైన్లు లాక్కొన్ని పారిపోయే దొంగలు ఇప్పుడు రూటు మార్చారు. మాయమాటలతో నమ్మించి ఒక గొలుసుతో సరిపెట్టకుండా ఏకంగా నిలువు దోపిడీ చేసేస్తున్నారు. దొంగలను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఐతే గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు నమ్మొద్దని.., ప్రజలు తమ సొత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు