వినాయక చవితి పండుగ రోజున ఆలయ పూజారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై ఈ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు వ్యక్తులు హోండా యాక్టివాపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న ఎస్.ఐ ఏసోబు మృతదేహాన్ని నందిగామ మార్చరీకి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శనగపాడు గ్రామానికి చెందిన సూరేపల్లి వీరభద్ర శర్మగా పోలీసులు తెలిపారు. ఆయన శనగపాడు శివాలయం పూజారి పనిచేస్తూ వచ్చారు. ప్రమాదంలో తీవ్ర గాయాలైన వ్యక్తి ఆయన కుమారుడిగా సమాచారం.
వినాయక చవితి సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజంతా వారు వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. పండగ సందర్భంగా విధులు ముగించుకుని తిరిగి తన స్వగ్రామమైన శనగపాడు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పండుగ రోజున జరిగిన ఈ ప్రమాదంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2020