ఏపీలో అత్యంత అమానుష ఘటన.. సోదరిపై యువకుడి అఘాయిత్యం..

పాతపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది.

news18-telugu
Updated: May 20, 2020, 10:31 AM IST
ఏపీలో అత్యంత అమానుష ఘటన.. సోదరిపై యువకుడి అఘాయిత్యం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కామాంధుల నుంచి రక్షణ కల్పించాల్సినోడే కామంతో చూశాడు.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినోడే కాటేశాడు.. బంధాలు, బాధ్యతలు మరిచి సోదరిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ అత్యంత అమానుష ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. పాతపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. పెద్ద కూతురు స్థానిక ఉన్నత పాఠశాలలో చదువుతోంది. వీళ్ల ఇంటి పక్కనే చిన్నాన్న కుటుంబం నివసిస్తోంది. అయితే, ఈ నెల 13న బాలిక తండ్రి పనికి వెళ్లగా, అది గమనించిన చిన్నాన్న కొడుకు పనపాన పరమేశు.. బాలిక ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి ఈ నెల 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిందీ ఘటన. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.
First published: May 20, 2020, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading