వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. పోలీసులు కంటపడకుండా ఉండేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నాయి. బయటకు వేరే కలరింగ్ ఇచ్చి లోపల మాత్రం పాడు పనులకు తెరతీస్తున్నాయి. స్పా సెంటర్ల పేరిట, ఫిజియోథెరపీ క్లినిక్ల ముసుగులో వ్యభిచార దందాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. దర్గామిట్టలోని ఫ్లాటినమ్ సెలూన్ అండ్ బ్యూటీ స్పాలో అసాంఘాకి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కోల్కతా వంటి నగరాల నుంచి యువతులు తీసుకువచ్చి వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలంగా ఈ పాడుపని కొనసాగిస్తున్నారు.అయితే ఫ్లాటినమ్ సెలూన్లో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడంతో.. అక్కడ జరుగుతున్న పాడు పని వెలుగులోకి వచ్చింది.
సెలూన్ పేరిట జరుగుతున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ దాడుల్లో కోలకత్తా యువతితో పాటుగా, ఓ విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా ఫ్లాటినమ్ సెలూన్లో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.
అయితే దర్గామిట్ట ప్రాంతంలో ఈ వ్యభిచార ముఠా గుట్టు రట్టుకావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇన్ని రోజులుగా సెలూన్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకుని షాక్ తిన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Nellore, Prostitution racket