మానవ సంబంధాలను వివాహేతర సంబంధాలు దెబ్బతీస్తున్నాయి. వివాహ వ్యవస్థకే మాయని మచ్చను తెస్తున్నాయి. కొందరిని హంతకులుగా మార్చి జైలు పాలు చేస్తున్నాయి. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని భర్త అత్యంత కిరాతకంగా మర్డర్ చేయించాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని కర్నూలు రూరల్ మండలం, మునగాలపాడుకు చెందిన చంద్రమని ఇటీవల హత్యకు గురయ్యాడు. అతని మర్డర్ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న చంద్రమణిని ఆమె భర్తే సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. కేసులో మునగాలపాడుకు గ్రామానికి చెందిన నిందితుడు నీలిషికారి శివాజీతో పాటు మరో ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ఇలా ఉంది.. మునగాలపాడుకు చెందిన చంద్రమణికి తాగుడు అలవాటు ఉంది. గ్రామంలో సారా విక్రయించే నిలిషికారి శివాజీ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఈ క్రమంలో శివాజజీ భార్యతో చంద్రమణికి పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న శివాజీ.., తన భార్యను వదిలేయాలని చంద్రమణిని హెచ్చరించారు. ఐతే చంద్రమణి తన మాట వినకపోగా..,బంధువుల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో చంద్రమణిని చంపేయాలని శివాజీ నిర్ణయించుకున్నాడు.
పక్కా స్కెచ్
హత్య చేయాలన్న నిర్ణయాని తన ఇల్లు నిర్మించిన తాపీ మేస్త్రీ షేక్ షాలుమీయాను సంప్రదించాడు. అతను షేక్ అహ్మత్ అనే వ్యక్తిని రంగంలోకి దించగా..అహ్మద్ తన కాలనీకే చెందిన వడ్డె రంగస్వామి, అడవి రాముడు, వడ్డె నాగపుల్లయ్యను పరిచయం చేశాడు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి చంద్రమణిని హత్య చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి రూ.2.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా శివాజీ రూ.లక్షా పదివేలు చెల్లించాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వడ్డె అడవి రాముడు, వడ్డె పుల్లయ్యలు చంద్రమణితో ఫ్రెండ్ షిప్ చేసారు. గతేడాది డిసెంబర్ 9న అడవిరాముడు, వడ్డె పుల్లయ్యలు మందు పార్టీ చేసుకుందామం రమ్మంటూ చంద్రమణిని గ్రామ శివారులోని ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లారు. చంద్రమణికి ఫూటుగా మద్యం తాగించి రోకలిబండతో తలపై మోది హత్య చేశారు.
ఘటనాస్థలిలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. టెక్నాలజీ సాయంతో దర్యాప్తు చేసిన పోలీసులు దాదాపు 40 రోజుల తర్వాత మిస్టరీని ఛేదించారు. ప్రధాన నిందితుడు శివాజీతో పాటు మరో ఏడుగురుని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఆటో, ఒక బైకు, రోకలిబండను సీజ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.