Andhra Pradesh: అందమైన అమ్మాయిలే అతడి టార్గెట్.. చివరికి ఎలా చిక్కాడంటే..

ప్రతీకాత్మక చిత్రం

Prostitution: అందమైన అమ్మాయిలే అతడి టార్గెట్. దుబాయ్ (Dubai)లో ఉద్యోగాల పేరిట వల వేస్తాడు. ఆ తర్వాత అరబ్ షేక్ లకు అమ్మేస్తాడు. ఇంకేముంది ఆ వ్యభిచార కూపంలో మగ్గిపోవాల్సిందే.

  • Share this:
    అందమైన అమ్మాయిలే అతడి టార్గెట్. దుబాయ్ లో ఉద్యోగాల పేరిట వల వేస్తాడు. ఆ తర్వాత అరబ్ షేక్ లకు అమ్మేస్తాడు. ఇంకేముంది ఆ వ్యభిచార కూపంలో మగ్గిపోవాల్సిందే. తనకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించిన మహిళ ఆ మోసగాణ్ణి పోలీసులకు పట్టించింది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఓ మహిళకు.. 2019లో తమిళనాడుకు చెందిన అరసు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ఓ అరబ్ షేక్ ఇంట్లో పనిమనిషిగా చేరాలని చెప్పి దుబాయ్ ఫ్లైట్ ఎక్కించాడు. ఇంకేముంది అక్కడెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసిన మహిళ షాక్ కు గురైంది. అతడు పంపింది వంట పని, ఇంటి పనికి కాదు.. వ్యభిచారానికి.

    దుబాయ్ లో ఉద్యోగం పేరుతో ఆమె వద్ద లక్షల్లో దండుకున్న అరసు.. చివరకు మహిళను అరబ్ షేక్ లకు అమ్మేశాడు. కొన్నాళ్లపాటు అక్కడ నరకం అనుభవించిన మహిళ.. ఆ తర్వాత వారి బారి నుంచి తప్పించుకొని దుబాయ్ లోని భారత కాన్సులేట్ కు చేరుకొని ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారుల సాయంతో సురక్షితంగా నగరికి చేరుకుంది. స్వగ్రామానికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల సాయంతో తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరసును అదుపులోకి తీసుకున్నారు. విచారణ భాగంగా అరసు చెప్పిన విషయాలతో పోలీసులు విస్తుపోయారు.

    దుబాయ్, సింగపూర్లో ఉద్యోగాల పేరుతో పదులకొద్దీ మహిళలు, యువతులను వ్యభిచార గృహాలకు అమ్మేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇలా పలు రాష్ట్రాల్లో మహిళలు మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఒక్క నగరిలోనే నలుగురు మహిళలను దుబాయ్ ఏజెంట్ల ద్వారా వ్యభిచార గృహాలకు అమ్మేసినట్లు నిందితుడు వెల్లడించారు. ఇదంతా ఓ అంతర్రాష్ట్ర ముఠా అని.. ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రంలో అమ్మాయిలకు వల వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చివరకు అరెస్ట్ చేసే సమయంలోనూ నిందితుడు యువతులను విదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దుబాయ్, సింగపూర్ దేశాల్లో ఉద్యోగాలిచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే అక్కడికి వెళ్లాలని పోలీసులు చెప్తున్నారు.
    Published by:Purna Chandra
    First published: