భర్త లేని మహిళను చేరదీశాడు.ఆమెతోవివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అక్కడితో ఆగక అనుమానంతో చంపేశాడు. ప్రశ్నించిన ఆమె తల్లిని కూడా హత్య చేసి మృతదేహాలను మాయం చేశాడు. చేసిన పాపం ఊరికే ఉంటుందా..? నాలుగు నెలల తర్వాత అతడ్ని పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.., చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె మండలం గంగిరెడ్డి పాలెం శివారులోని ఏటిగట్టుతండాలో నాలుగు నెలల క్రితం జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నవాడే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. పీలేరుకు చెందిన సరళ.. భర్త చనిపోవడంతో పుట్టిల్లైన గంగిరెడ్డిపల్లి శివారులోని ఏటిగట్టు తండాకు ఏడేళ్ల క్రితం వచ్చింది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా సరళ తల్లి గంగులమ్మ వద్ద ఉంటున్నారు.
ఐతే మీ కుటుంబానికి అండగా ఉంటానంటూ అదే గ్రామానికి చెందిన మౌలాలీ అనే వ్యక్తి సరళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది సరళతో పాటు ఆమె తల్లి గంగులమ్మను ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి పెద్దేరు ప్రాజెక్టుకు దగ్గరలో ఉన్ తన పొలంలో చిన్న ఇల్లు కట్టి అక్కడే ఉంచాడు. అప్పటి నుంచి అనుమానంతో సరళను వేధిస్తున్న మౌలాలీ.. సెప్టెంబర్ 29న ఆమెను తీవ్రంగా కొట్టి హత్య చేశాడు. తన కుమార్తె కనిపించకపోవడంతో గంగులమ్మ.. మౌలాలీని నిలదిసింది. దీంతో ఆమెను కూడా గొంతు నులిమి హత్య చేశాడు. సరళ మృతదేహాన్ని పెద్దేరు జలాశయంలోనూ, గంగులమ్మ శవాన్ని గంగచెరువులోని పడేసి అవి నీటిలో తేలకుండా చెట్లకు కట్టేశాడు.
మరోవైపు తల్లి, అమ్మమ్మ ఎక్కడున్నారని ముగ్గురు పిల్లలను మౌలాలీని నిలదీశారు. దీంతో వారికి కరోనా రావడంతో ఆస్పత్రిలో చేర్పించానని నమ్మించి కర్ణాటకలోని ఓ గ్రామానికి తరలించాడు.. ఇటీవల వారి మృతదేహాలకు సంబంధించిన ఎముకలు, దుస్తులు పైకి తేలడంతో వాటికి డీఎన్ఏ పరీక్షలు చేశారు. సరళ బంధువులు అనుమానంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మౌలాలీని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తానే హత్యలు చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. సరళతో సంబంధం పెట్టుకోవడానికి ముందు మౌలాలీకి ఇద్దరు భార్యలు ఉన్నట్లు తెలిసింది. అమ్మ, అమ్మమ్మ హత్యకు గురవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు వారిని బంధువులకు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Crime, Crime news, Extramarital affairs, Illegal affair, Murders, Telugu news, Tirupati