Robbery: తెలంగాణ పోలీసులకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. ఓ దొంగను వెనకేసుకొచ్చిన నాయకులు..

పెబ్బెరు పోలీస్ స్టేషన్

Robbery: ఓ చోరీ కేసులో దొంగను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. అతడు దొంగిలించిన సొత్తును రకవరీ చేసేందుకు కర్నూలు వెళ్లిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురయ్యింది. అసలేం జరిగిందంటే..

  • Share this:
    (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    ఆత్మకూర్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి కి చెందిన దొంగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆత్మకూరులోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాలు విక్రయించాడు. వాటిని రికవరీ చేసేందుకు వచ్చిన తెలంగాణ పోలీసులకు చుక్కెదురైంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఓ దొంగను వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీసులు చోరీకేసులో అరెస్టు చేశారు. దొంగతనం చేసిన బంగారం ఎక్కడ విక్రయించావని విచారించగా ఆత్మకూరులో లో ఓ బంగారు వ్యాపారి కి అమ్మానని చెప్పాడు. అతన్ని తీసుకొని ఆత్మకూరుకు వచ్చిన స్థానిక షరాఫ్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రశీదు ను పెబ్బేరు పోలీసులు సంప్రదించారు. ఆయనతోపాటు ఇతర వ్యాపారులు పెబ్బేర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ఆభరణాలను ఇంతియాజ్ అనే వ్యాపారి కి విక్రయించానని దొంగ చెప్పడంతో రషీద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మకూరులో అలాంటి సొమ్ము ఎవరూ కొనుగోలు చేయరని ఎవరికి విక్రయించావో సరిగ్గా చెప్పాలని దొంగను అడిగారు.

    తెలంగాణ పోలీసులే తనను ఒప్పించి ఏదో ఒక దుకాణం పేరు చెప్పాల్సిందిగా బలవంతం చేశారంటూ దొంగ వెల్లడించాడు. బంగారం ఆత్మకూరులో విక్రయించినట్లు ఆధారాలు ఉంటే కేసు నమోదు చేయాలని కోర్టుకు హాజరవుతానని రషీదు సూచించడంతో పెబ్బేరు పోలీసులు వెనుదిరిగారు. ఈ విషయమై పెబ్బేర్ ఎస్సై రాఘవేంద్ర రెడ్డి ని సంప్రదించగా బస్టాండ్ సీసీ ఫుటేజీ ఆధారంగా మహిళ నుంచి బంగారం తీసుకెళ్లిన దొంగను గుర్తించామన్నారు. అక్కడి నాయకులు దొంగను వెనకేసుకొచ్చి తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

    దొంగిలించిన దొంగ ఆత్మకూరులో బంగారం విక్రయించినట్లు తెలిపిన తర్వాతనే తాము ఆత్మకూరు వెళ్లామని చెప్పారు. ఆత్మకూరు పోలీసులపై రాజకీయ ఒత్తిళ్ళు ఉడటంతో తమకు సహకరించడం లేదని ఎస్సై చెప్పారు. అక్కడ ఉన్నతాధికారులను సంప్రదించామని చోరీకేసులో పరిశోధన ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు చేపడతామన్నారు.
    Published by:Veera Babu
    First published: