Home /News /crime /

ANDHRA PRADESH NEWS ONE A FAMILY COUNSELING CENTER THAT CONNECTS DIVORCING SPOUSES IN VIZIANAGARAM NGS VZM

Marriage Life: విడాకులు అంటూ అక్కడి వెళ్తే.. తిరిగి కలిసే వస్తారు.. విడిపోయిన జంటలను ఏకం చేస్తున్నారు..

విడిపోతున్న భార్య భర్తలను కలుపుతారు

విడిపోతున్న భార్య భర్తలను కలుపుతారు

Marriage Life: ప్రేమ పెళ్లి అయినా.. పెద్దలు కుదిర్చిన సంబంధంమైనా.. పెళ్లైనా మూడు నాలుగేళ్లకే కాపురాలు కూలిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే పెళ్లిల్లు పెటాకులవుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ ల వాడకం పెరిగిన తరువాత విడాకుల సంఖ్య పెరుగుతోంది. క్షణికావేశంలో భార్య భర్తలు విడిపోతున్నారు. విడిపోవాలి అనుకుంటున్నారు.. ఎంతప్రయత్నించినా కలిసి ఉండం అంటున్నారు.. కానీ ఒక దగ్గర మాత్రం విడాకుల కోసం వెళితే.. తిరిగి భార్య భర్తలు కలిసి వచ్చేలా చేస్తారు. చక్కగా సంసారం సాగేలా చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    Marriage Life: ఇద్దరు మనుషులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను కలిపేదే వివాహం (Marraige).. ప్రేమ పెళ్లైనా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. జీవితాంతం ఒకరికి ఒకరు తోడు ఉండాలని కోరుకుంటూ.. ఒక్కటవుతారు. పెళ్లి చేసుకునే సమయంలో ఎన్నో ప్రమాణాలు చేసుకుంటారు. జీవితాంతం ఒకరికి ఒకరు కష్టాల్లో, సుఖాల్లో తోడుగా నిలుస్తామని వాగ్ధానాలు చేస్తారు.. అయితే ఇదంతా మూనాళ్ల ముచ్చటే అవుతోంది. ఈ రోజుల్లో 40 శాతానికి పైగా పెళ్లిల్లు పెటాకులవుతున్నాయి. పెళ్లైన మూడు, నాలుగేళ్లకే కాపారాలను కూల్చేసుకుంటున్నారు. అది కూడా చిన్న చిన్న కారణాలకు కూడా విడిపోవడమే బెటర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) , స్మార్ట్ ఫోన్లు (Smart Phones) పెరగడంతో.. భార్య భర్తల (Wife and Husband) మధ్య అనుబంధాలు దూరమై.. అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కారణంతోనే అనేక జంటలు విడిపోతున్నాయి. ప్రేమ వివాహాలు అంటే.. పెళ్లికి ముందు స్నేహితులు అండగా ఉంటారు.. పెళ్లి తరువాత ఆ ప్రేమ కనిపించకపోయే సరికి.. సర్ధి చెప్పే వారు లేక విడిపోతున్నవారు ఉన్నారు. ఇక పెద్దలు కుదుర్చిన సంబంధాలు కూడా తెగిపోతున్నాయి. పెద్దలు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా వారు వినడం లేదు.. కలిసి ఉండలేమని చెప్పి విడాకులకు తొందరపడుతున్నారు..

    ఇటీవల కాలంలో ఫ్యామిలీ కోర్టుల్లో ఈ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రతి జిల్లాల్లోనూ విడాకుల కేసుల సంఖ్యలు రెట్టింపు అవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే విజయనగరంలో మాత్రం విడిపోదామనుకున్న.. విడిపోయిన జంటలను ఏకం చేస్తూ.. రాజీ బాట పట్టిస్తున్నారు. విడిపోవాలి అనుకుంటున్నా.. విడిపోయిన జంటలను కూడా మళ్లీ కలిసేలా సరికొత్త జీవితాన్ని అందించేలా చేస్తున్నారు గృహ హింస విభాగ ప్రతినిధులు. విడిపోవడం ఓ క్షణం ... అదే దగ్గరైతే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అంటూ.. మానసిక పరివర్తనను తీసుకొస్తున్నారు.. ఎంటో జంటలను కలుపుతున్నారు ఆ ప్రతినిధిలు..

    ఇదీ చదవండి : ఏపీ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్.. నేటి నుంచి నామినేషన్లు

    విజయనగరంలో ఉన్న గృహ హింస విభాగం ఇలా ఇప్పటి వరకు విడిపోదాం అనుకున్న 130కి పైగా జంటలను కలిపింది. అంతే కాదు చిన్న చిన్న కారణాలతో విడిపోయిన జంటలు ఉన్నాయని వారికి సమాచారం అందితే.. వారిని పిలిపించి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి కలుపుతున్నట్టు చెబుతున్నారు. ఈ విభాగంలో ఒక సోషల్‌ కౌన్సిలర్, లీగల్‌ కౌన్సిలర్, ఇద్దరు హోం గార్డులు పనిచేస్తున్నారు. వీరి దగ్గరకు రోజు రోజుకూ వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది సరైనా కారాణాలతోనే విడిపోవాలి అనుకున్నా.. కొందరు చిన్న చిన్న కారాణాలకు కూడా విడిపోతున్నారు. అయితే అలాంటి వారందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఒక వేళ ఇద్దరిలో ఎవరిది తప్పని తెలిస్తే వారిని గట్టిగానే మందలిస్తూ.. వారిని కలుపుతున్నారు.

    ఇదీ చదవండి : స్నేహమంటే ఇదేరా.. జాతి వైరం మరిచి సాయం చేసుకుంటున్న కోతి-కుక్క.. హద్దులు లేని ఫ్రెండ్ షిప్

    గృహహింస విభాగాన్నిఆశ్రయించిన మహిళలనుతన భర్తతో కలిసి ఉండేలా కౌన్సిలర్లు చర్యలు చేపడతారు. మహిళల నుంచి ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను పిలిపించి మొదటట కౌన్సిలింగ్ ఇస్తారు. అప్పటికీ రాజీ పడకపోతే.. పలు రకాలుగా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అప్పటికీ కుదరకపోతే.. ఉచితంగా కోర్టులో కేసు వేస్తారు. కోర్టుకు వెళ్లిన తర్వాత కూడా విడాకులకు కాకుండా ఒక్కటయ్యే మార్గాన్నే వారు చూపిస్తారు. విడాకులనేది ఆఖరి అస్త్రంగా ప్రయోగిస్తారు.

    ఇదీ చదవండి : మళ్లీ టీడీపీవైపు చూస్తున్న కీలక నేత.. బీజేపీ తో లాభం లేదనుకున్నారా..?

    2006లో కలెక్టరేట్ లో ఈ గృహహింస విభాగం జిల్లాలో ఏర్పాటయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 767 మంది గృహహింస విభాగాన్ని అశ్రయించారు. వీరిలో కౌన్సిలింగ్‌ ద్వారా 130 మందిని కలిపారు. 122 మంది కేసులను ఉపసంహరించుకున్నారు. 512 కేసులు కోర్టులో వేయగా 65 మంది కోర్టు సమక్షంలో మళ్లీ చేయీచేయీ కలిపారు. 149 కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇలా తమ వద్దరకు విడాకుల కోసం వచ్చే వారినే కాదు.. చిన్న చిన్న కారణాలతో విడిపోయారని.. వారి బంధువులు ఎవరైనా చెపితే.. వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మరి కలుపుతుండడం విశేషం..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Divorce couple, Love marriage, Vizianagaram

    తదుపరి వార్తలు