Home /News /crime /

ANDHRA PRADESH NEWLY MARRIED WOMAN COMMITS SUICIDE IN EAST GODAVARI SU

Andhra Pradesh: మేనమామతో పెళ్లి.. ఏడో రోజే తీవ్ర విషాదం.. గదిలోకి వెళ్లిన నవవధువు..

నవ వధువు ఆత్మహత్య

నవ వధువు ఆత్మహత్య

ఆ ఇంట్లో పెళ్లి సందడి ఇంకా తగ్గలేదు.. అయితే అంతలోనే తీరని విషాదం నెలకొంది. ఏడడుగులు వేసిన ఏడు రోజులకే నవ వధువు ప్రాణాలు తీసుకుంది.

    ఆ ఇంట్లో పెళ్లి సందడి ఇంకా తగ్గలేదు.. అయితే అంతలోనే తీరని విషాదం నెలకొంది. పెళ్లి జరిగిన ఏడో రోజే నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం జరిగింది. వివరాలు.. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన తొండారపు వీరవెంకటలక్ష్మి పెద్ద కుమార్తె అశ్వినీ స్వాతి(19)కి కోరుకొండ మండలం గాదరాడకు చెందిన కనుమురెడ్డి అశోక్‌తో గత నెల 29న వివాహం చేశారు. స్వాతికి అశోక్ మేనమామ వరస అవుతాడు. అతడు తాపీ పని చేసేవాడు. స్వాతి అత్తింటి వారు కొత్తగా కట్టుకున్న ఇంటిలో రెండు రోజుల క్రితం గృహ ప్రవేశం కూడా చేసింది. ఆషాఢ మాసం వస్తుండటంతో.. సోమవారం స్వాతిని పుట్టింటికి పంపేందుకు సిద్దం చేశారు.

    అయితే ఇంతలో ఏం జరిగిందో తెలియదు గానీ.. తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ ఉన్న సమయంలో స్వాతి ఇలా గదిలోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంది. స్వాతి ఆత్మహత్య చేసుకుందని తెలిసిన అశోక్ కుప్పకులాడు. అయితే ఇరుకుటుంబాలు దగ్గరి బంధువులు కావడంతో..ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.

    చదవండి: Twin Sisters: విడిపోతామనే భయం.. ఆత్మహత్య చేసుకున్న కవలలు.. అసలేం జరిగిందంటే..

    అయితే బంధువుల్లో ఓ వ్యక్తి 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్‌జోన్‌ డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పరిసరాలను పరిశీలించారు. మృతదేహానికి తహసీల్దారు సమక్షంలో పంచనామా నిర్వహించారు. చివరకు మృతురాలి తల్లి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మూడేళ్ల క్రితం ఇరుకుటుంబాల పెద్దలు స్వాతి, అశోక్‌లకు పెళ్లి చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, East Godavari Dist, Suicide

    తదుపరి వార్తలు