Home /News /crime /

ANDHRA PRADESH MARRIED WOMAN COMMITTED SUICIDE DUE TO FIGHT OVER PONGAL SHOPPING SRD

Andhra Pradesh : పండుగకు కొత్త బట్టలు కొనలేదని భర్తతో తగాదా..చివరికి ఏం చేసిదంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh : తెలుగువారికి ముఖ్యంగా నవ్యాంధ్ర జనాలకు సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఏ పండగకు కొనకపోయినా సంక్రాంతి పండగకు మాత్రం కొత్త బట్టలు కొనుక్కోవాల్సిందే. అయితే సంక్రాంతి పండుగకి బట్టలు కొనలేదని...

    తెలుగువారికి ముఖ్యంగా నవ్యాంధ్ర జనాలకు సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఏ పండగకు కొనకపోయినా సంక్రాంతి పండగకు మాత్రం కొత్త బట్టలు కొనుక్కోవాల్సిందే... అయితే సంక్రాంతికి కొత్త దుస్తులు కొనలేదని వివాహిత.. భర్తతో గొడవ పడి చివరికి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా నేరడి–బికి చెందిన వివాహిత మునగవలస వాహిణి శనివారం రాత్రి పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. అర్ధ రాత్రి వేళ ఇంట్లో పడి ఉండటాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు భామిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సంక్రాంతికి కొత్త దుస్తులు కొనలేదని భర్త అప్పన్నతో తగాదాపడి మనస్థాపంతోనే పురుగు మందు తాగిందని మృతురాలి తండ్రి సరిసాబద్ర లచ్చయ్య పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బత్తిలి ఎస్‌ఐ కరణం వెంకటసురేష్‌ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

    ఇక శ్రీకాకుళం జిల్లాలోనే బత్తిలి గ్రామంలో కూడా మరో విషాదం జరిగింది. బత్తిలిలో ఏడో తరగతి చదువుతున్న ఒడిశాకు చెందిన కుంబిరిక కావేరికడుపునొప్పి తాళలేక శనివారం రాత్రి పురుగు మందు తాగింది. చిన్నప్పటి నుంచి బియ్యం తినడం అలవాటు ఉంది. బియ్యం తినడంతో కడుపు నొప్పికి గురైందని పోలీసులు తెలిపారు. సమీపంలోని ఒడిశా జగన్నాథపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయఘడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఒడిశాలోని విక్రాంపురం గ్రామానికి చెందిన కావేరి బత్తిలిలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుతోంది. మృతురాలి తండ్రి కుంబిరిక ప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బత్తిలి పోలీసులు కేసు నమోదు చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Andhra Pradesh, Srikakulam, Stomach pain, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు